Rana Daggubati: మైత్రీ మూవీ మేకర్స్ తో కలిసి ప్రశాంత్ వర్మ యూనివర్స్ లో ‘జై హనుమాన్’ మూవీని తెరకెక్కించబోతున్నారు ప్రశాంత్ వర్మ. ఇందులో హనుమంతుడి పాత్రను జాతీయ ఉత్తమ నటుడు రిషబ్ శెట్టి చేస్తున్నారని తెలియగానూ సూపర్ క్రేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న విషయం ఏమంటే… ‘జై హనుమాన్’లో అసురగణాధినేత పాత్రను రానా పోషించబోతున్నాడట. తాజాగా ప్రశాంత్ వర్మ… రిషబ్ శెట్టి, రానాతో ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దాంతో రానా ‘జై హనుమాన్’లో విలన్ గా చేయబోతున్నాడనే ప్రచారం ఊపందుకుంది. ‘బాహుబలి’తో పాటు పలు హిందీ చిత్రాలతో రానా కు ఉత్తరాదిన మంచి క్రేజ్ ఏర్పడింది. దాంతో అతన్ని తన యూనివర్శ్ లోకి ప్రశాంత్ వర్మ తీసుకొచ్చాడని అంటున్నారు. మరి దీనికి సంబంధించిన అధికారిక సమాచరం ఎప్పుడు వస్తుందో చూడాలి.
ఇది కూడా చదవండి: Unstoppable With NBK S4: నేను ‘సింహం’.. అతను ‘సింగం’…! అన్ స్టాపబుల్ సూర్య ప్రోమో అదుర్స్!