Suravaram Sudhakar Reddy

Suravaram Sudhakar Reddy: సీపీఐ నేత‌ సుర‌వ‌రం సుధాక‌ర్‌రెడ్డి మృతి.. సంతాపం తెలిపిన ప్రముఖులు

Suravaram Sudhakar Reddy: సీపీఐ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి (83) శుక్రవారం రాత్రి (ఆగస్టు 22) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో వైద్యుల ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఆయన మరణం కమ్యూనిస్టు వర్గాలతో పాటు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.

రాజకీయ ప్రస్థానం

1942 మార్చి 25న మహబూబ్‌నగర్‌ జిల్లా కొండ్రావుపల్లి గ్రామంలో జన్మించిన సుధాకర్ రెడ్డి, విద్యార్థి దశ నుంచే ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. కర్నూలు ఉస్మానియా కళాశాల నుండి బీఏ పూర్తిచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌బీ పట్టా సాధించారు.
1998, 2004లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికై పార్లమెంట్‌లో ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2012 నుండి 2019 వరకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కీలక భాద్యతలు నిర్వర్తించారు.

కుటుంబ నేపథ్యం

సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధుడు. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని విశేష సేవలు అందించారు. 1974లో విజయలక్ష్మిని వివాహం చేసుకున్న ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

నివాళులు

సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.


టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు – “సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి ఇకలేరన్న వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయనతో కలిసి పని చేసిన రోజులు గుర్తుకొస్తున్నాయి. విలువలతో రాజీ పడని నాయకుడిగా ఆయన చిరస్థాయిగా గుర్తిండిపోతారు.” అని ఘన నివాళులు అర్పించారు.

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ – “విద్యార్థి సంఘం నేతగా ప్రారంభమై ప్రజా ఉద్యమాలకు జీవితాంతం అంకితమై పనిచేసిన సుధాకర్ రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం.” అని పేర్కొన్నారు.

సురవరం మృతికి సీపీఐ నేత నారాయణ సంతాపం, కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన నారాయణ, సురవరం మృతి పార్టీ, వామపక్ష ఉద్యమానికి తీరనిలోటు, పార్టీ నన్ను ఎంతో ప్రోత్సహించారు: సీపీఐ నేత నారాయణ

సురవరం మృతికి బండి సంజయ్ సంతాపం, నిరంతరం పేదల అభ్యున్నతికి సురవరం పాటుపడ్డారు: బండి సంజయ్

సురవరం మృతికి టి.బీజేపీ చీఫ్‌ రాంచందర్‌రావు సంతాపం, నమ్మిన సిద్ధాంతం కోసం చివరి వరకు సురవరం పనిచేశారు, సురవరం మరణం తెలుగు ప్రజలకు తీరనిలోటు: రాంచందర్‌రావు

సురవరం సుధాకర్‌రెడ్డి మృతికి మహేష్‌గౌడ్ సంతాపం, సురవరం మరణం రాజకీయాలకు తీరని లోటు: మహేష్‌గౌడ్

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *