ప్రధాని నరేంద్ర మోదీ తన అమెరికా పర్యటనలో రెండో రోజైన ఆదివారం న్యూయార్క్‌లో భారత సంతతి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గంటా ఏడు నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో మోదీ తన రాజకీయ జీవితం, భారతదేశ ప్రగతి, వలసలపై చర్చించారు. న్యూయార్క్‌లోని నసావు వెటరన్స్ కొలీజియం వద్దకు ప్రధాని చేరుకోగానే వేలాది మంది ప్రజలు మోదీ-మోదీ అంటూ నినాదాలు చేశారు. మోదీకి స్వాగతం పలికేందుకు ముందుగా అమెరికా జాతీయ గీతం, ఆ తర్వాత భారత జాతీయ గీతం వినిపించారు. అనంతరం భారత సంతతి ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.
తన ప్రసంగం ప్రారంభంలో నమస్తే అంటూ ప్రజలను పలకరించిన మోదీ, ఆపై, ‘‘మన నమస్తే లోకల్ నుంచి గ్లోబల్‌కు బహుళజాతిగా మారింది. నేను సీఎంగానో, పీఎంగానో లేనప్పుడు ఎన్నో ప్రశ్నలతో యూఎస్ వచ్చేవాడినని ఏ పదవిలో లేనప్పుడు అమెరికాలోని 29 రాష్ట్రాల్లో పర్యటించానని మోదీ అన్నారు.
#WATCH | New York, USA: Prime Minister Narendra Modi held a Roundtable meeting with prominent CEOs of Tech Companies.
PM Narendra Modi says, “Today India is rapidly emerging as a global biotech powerhouse…There are possibilities for affordable research, and affordable… pic.twitter.com/uFupjkbd0o
— ANI (@ANI) September 23, 2024
మోదీ ప్రసంగంలో ఇతర ముఖ్యాంశాలు…
- తదుపరి ఒలింపిక్స్ USAలో. త్వరలో భారత్ కూడా ఒలింపిక్స్‌కు ఆతిధ్యం ఇవ్వనుంది. మేము 2036ని హోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము.
- క్రీడలు, వ్యాపారం లేదా వినోదం ఏదైనా, భారతదేశం భారీ ఆకర్షణకు కేంద్రంగా ఉంది. ఐపీఎల్ ప్రపంచంలోని టాప్ లీగ్‌లలో ఒకటి. మన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా ఊపందుకుంటున్నాయి.
- భారతదేశం వ ప్రపంచంపై ప్రభావం చూపిస్తోంది. మనం నిప్పులా మండడం లేదు, సూర్యుడిలా కాంతిని ఇవ్వబోతున్నాం. మనం ప్రపంచాన్ని ఆధిపత్యం చేయాలనీ అనుకోవడం లేదు. కానీ శ్రేయస్సుకు దోహదం చేయాలనుకుంటున్నాము.
- ఒక దశాబ్దంలో, భారతదేశం పదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ నుండి ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఇప్పుడు భారతదేశం త్వరగా మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని ప్రతి భారతీయుడు కోరుకుంటున్నాడు.
- మనం ప్రపంచాన్ని నాశనం చేయబోము. ప్రకృతి పట్ల మనకున్న ప్రేమ విలువలు మనకు ఆ విధమైన మార్గనిర్దేశం చేశాయి.