Earthquake

Earthquake: 7 నిమిషాల వ్యవధిలో రెండు సార్లు భూ ప్రకంపనలు.. వణికిన ప్రజలు

Earthquake: గుజరాత్‌లోని కచ్ జిల్లాలో రెండు స్వల్ప భూకంపాలు సంభవించాయి. కేవలం 7 నిమిషాల వ్యవధిలో ఈ రెండు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు స్వల్పంగా ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎటువంటి ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు నివేదికలు లేవు. గురువారం రాత్రి 10.12 గంటల సమయంలో 3.4 తీవ్రతతో తొలిసారి కంపించింది భూమి. బచౌ పట్టణానికి 20 కిలోమీటర్ల ఈశాన్యంలో భూమి లోపల ఉంది. బచౌ అనేది 2001లో సంభవించిన భారీ భూకంపం వల్ల తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతం.

ఇది కూడా చదవండి: Thalapathy Vijay: త‌మిళ హీరో విజ‌య్ వ్యాఖ్య‌లు వైర‌ల్‌.. రాజ‌కీయ వ‌ర్గాల్లో గుబులు

ఇది జరిగిన 7 నిమిషాల తర్వాత అంటే రాత్రి 10:19 గంటలు మళ్లీ భూకంపం రావడంతో ఆందోళనకు గురైయ్యారు ప్రజలు. రిక్టర్ స్కేల్‌పై 2.7గా నమోదైంది. రాపర్‌కు 19 కిలోమీటర్ల వాయువ్యంలో భూమి లోపల ఉంది. కచ్ జిల్లాలో భూకంపాలు సంభవించడం సాధారణం. ఇది “అత్యంత ప్రమాదకర” భూకంప జోన్‌లో ఉన్నందున, తరచుగా స్వల్ప స్థాయి ప్రకంపనలు సంభవిస్తూ ఉంటాయి. 2001లో వచ్చిన వినాశకరమైన భూకంపం తర్వాత ఈ ప్రాంత ప్రజలు భూకంపాల పట్ల చాలా అప్రమత్తంగా ఉంటారు. ఈ తాజా భూకంపాల వల్ల ఎటువంటి నష్టం జరగలేదని జిల్లా విపత్తు నిర్వహణ అధికారులు తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *