Telangana New Liquor Policy: తెలంగాణ రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు నవంబర్ 30వ తేదీతో గత లైసెన్స్‌ల గడువు ముగియనున్నది. ఈ మేరకు కొత్త టెండర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. రాష్ట్రంలోని 2,620 దుకాణాలకు లైసెన్స్‌దారుల ఎంపిక ప్రక్రియకు ఈ నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబర్ నెల ఒకటో తేదీ నుంచి నూతన మద్యం దుకాణాలు ఏర్పాటవుతాయి. దీనికోసం లాటరీ ద్వారా కొత్త లైసెన్స్‌లను ఎంపిక చేస్తారు.
Telangana New Liquor Policy: నూతన మద్యం నోటిఫికేషన్‌లో భారీగా దరఖాస్తు రుసుమును పెంచారు. గతంలో 2 లక్షలుగా ఉన్న దరఖాస్తు రుసుమును ఈ సారి రూ.3 లక్షలకు నాన్ రిఫండబుల్ ఫండ్‌గా ఎక్సైజ్ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీగా కూడా నోటిఫికషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.
Telangana New Liquor Policy: 2025-27 సంవత్సరానికి గాను మద్య షాపుల టెండర్ల కోసం ఈ లాటరీలు నిర్వహించనున్నారు. అంటే 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ పొందిన యాజమానులకు మద్యం దుకాణాల కాలపరిమితి వర్తిస్తుంది. దరఖాస్తు దాఖలు చేసే విషయంలో ఎలాంటి పరిమితులు లేవని ప్రభుత్వం పేర్కొన్నది. ఒక వ్యక్తి ఎన్ని దరఖాస్తులనైనా సమర్పించవచ్చు.
Telangana New Liquor Policy: రాష్ట్రంలోని మద్యం దుకాణాల కేటాయింపుల్లో 30 శాతం మేర రిజర్వేషన్లను కేటాయించారు. గౌడ సామాజికవర్గానికి 15 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం చొప్పున మద్యం దుకాణాలను కేటాయిస్తారు. ఈ టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఉమ్మడి సంస్థలకు, ఏదైనా కంపెనీలకు కూడా అవకాశం కల్పించనున్నారు.
Telangana New Liquor Policy: ఎంపికైన లైసెన్స్‌దారులు 6 స్లాబుల ద్వారా లైసెన్స్ ఫీజును చెల్లించేందుకు అవకాశం కల్పించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం.. ఈ సారి కూడా మద్యం దుకాణాల లైసెన్స్‌లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నది. మద్యం దుకాణాల దరఖాస్తు ప్రక్రియ తేదీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి ఉన్నది.