Dates For Weight Loss

Dates For Weight Loss: ఖర్జూరాలు తింటే బరువు తగ్గుతారా ?

Dates For Weight Loss: ఖర్జూరాలు రుచికే కాదు ఆరోగ్యానికి కూడా బలేగా పనిచేస్తాయి. మన దేశంలో అనేక రకాల ఖర్జూరాలు పండిస్తారు. వీటి పరిమాణం, రుచి, పోషక విలువలలో చాలా మార్పులు ఉంటాయి. అయితే బరువు తగ్గడానికి కూడా ఖర్జూరాలు ఉపయోగపడతాయని మీకు తెలుసా? ఏ విధమైన ఖర్జూరం తింటే బరువు ఇట్టే తగ్గుతారో ఇక్కడ తెలుసుకుందాం..

ఖర్జూరం రుచికరమైన సూపర్ ఫుడ్ మాత్రమే కాదు.. ఇవి ప్రత్యేకమైన పోషకాలతో నిండి ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల ఖర్జూరాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి విభిన్నమైన రుచి, ఆకృతి, పోషకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారం, బరువు తగ్గడం విషయానికి వస్తే తదనుగుణమైన ఖర్జూరాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. మీరు ఆరోగ్యకరమైన రీతిలో బరువు తగ్గాలనుకుంటే, మీ ఆరోగ్యానికి ఏ రకమైన ఖర్జూరాలు ప్రయోజనకరంగా ఉంటాయో ముందుగా తెలుసుకోవాలి. నేడు మన దేశంలో డెగ్లెట్ నూర్, బర్హి (పాక్షికంగా ఎండిన, పండిన), అజ్వా, మెడ్జూల్, సుక్కరి వంటి 6 రకాల ప్రధాన ఖర్జూర రకాలు ఉన్నాయి. బరువు తగ్గడానికి ఏ ఖర్జూరాలు ఉత్తమమో ఇక్కడ తెలుసుకుందాం..

అజ్వా ఖర్జూరాలు
అజ్వా ఖర్జూరాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వును తగ్గించే ఆహారానికి ఇవి మంచి ఎంపిక. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది అతిగా తినడాన్ని నివారిస్తుంది. శరీరంలోని జీవక్రియను వేగవంతం చేసి చెడు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.

డాలెట్ నూర్
ఇతర ఖర్జూరాలతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉండటం వల్ల ఇవి బరువు తగ్గడానికి మంచివి. ఇందులో అధిక ఫైబర్ కారణంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కొవ్వు నష్టం ప్రక్రియను వేగవంతం చేస్తుంది. అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలు అంత త్వరగా పెరగవు. ఇది కొవ్వు నిల్వను తగ్గిస్తుంది.

Also Read: Boda kakarakaya: బోడ కాకరకాయ తింటే కలిగే ప్రయోజనాలు ఇవే..

బర్హి ఖర్జూరం (పండిన పండ్లు)
బర్హి ఖర్జూరాలు చాలా తీపిగా ఉంటాయి. ఇది చాలా మృదువుగా, జ్యుసిగా ఉంటుంది. రుచిలో తేనెను పోలి ఉంటుంది. ఇది తినడానికి చాలా రుచికరంగా ఉండటమే కాకుండా, ఇతర ఖర్జూరాలతో పోలిస్తే ఇందులో అత్యధిక చక్కెర శాతం కూడా ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, దీనిని తినకపోవడమే మంచిది.

మెడ్‌జూల్ ఖర్జూరం
మెడ్‌జూల్ ఖర్జూరాలను ఖర్జూరాలలో రారాజు అని పిలుస్తారు. ఇది పరిమాణంలో చాలా పెద్దది. పంచదార పాకంలా రుచిగా ఉంటుంది. కానీ ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఒక మెడ్‌జూల్ ఖర్జూరంలో 70కిపైగా కేలరీలు ఉంటాయి. అయితే దీన్ని తినడం వల్ల మీకు తక్షణ శక్తి లభిస్తుంది.

ALSO READ  Horoscope Today: నేటి రాశిఫలాలు మీ భవిష్యత్తుకు మార్గనిర్దేశం!

సుక్కరి
సుక్కరి ఖర్జూరాలు చాలా మృదువుగా, తియ్యగా, నోటిలో వేస్తే ఇట్టే కరిగిపోతాయి. ఇతర ఖర్జూరాలతో పోలిస్తే దీని రుచి చాలా బాగుంటుంది. కానీ ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. మీరు దీన్ని తినేటప్పుడు ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. కానీ దీన్ని అధికంగా తీసుకుంటే మాత్రం బరువు తగ్గడం సాధ్యం కాదు.

బర్హి ఖర్జూరాలు (సెమీ-డ్రై)
బర్హి ఖర్జూరాలు రెండు రకాలు. ఒకటి పాక్షికంగా పొడిగా ఉంటుంది. మరొకటి తాజాగా ఉంటుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే సగం ఎండబెట్టిన, తొక్క తీయని ఖర్జూరాలను తీసుకోవడం మంచిది. అవి పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి. వీటి రుచి చాలా తియ్యగా ఉంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి ఏ ఖర్జూరాలు మంచివి..
మీరు బరువు తగ్గాలనుకుంటే అజ్వా, డాగ్లెట్ నూర్ ఖర్జూరాలు తీసుకోవచ్చు. అంతేకాకుండా, సెమీ-డ్రై బర్హీ ఖర్జూరాలు కూడా తినవచ్చు. వీటిని పరిమిత పరిమాణంలో అంటే 2-3 ఖర్జూరాలు మాత్రమే తినాలి. ఇవి బరువు తగ్గడానికి సహాయపడతాయి

గమనిక: ఇక్కడ ఇచ్చిన ఆర్టికల్ ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఇచ్చింది. సంబంధిత విషయాలపై ఆసక్తి ఉన్న పాఠకుల కోసం అందించడం జరిగింది. ఈ ఆర్టికల్ లోని అంశాలను ఫాలో అయ్యే ముందు మీ ఫ్యామిలీ డాక్టర్ ను సంప్రదించాల్సిందిగా మహా న్యూస్ సూచిస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *