Krushna Rever:కృష్ణమ్మ వరద ప్రవాహం ఆగస్టులోనూ కొనసాగుతున్నది. జూలై నుంచి మొదలైన వదర ప్రవాహం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నది. గత నెలలోనే ఎగువన ఉన్న అన్ని జలాశయాలు నిండగా, ఈ నెలలోనే సాగర్ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువలో ఉన్నది. ప్రస్తుతం భారీగా వరద ప్రవాహం కొనసాగుతున్నది.
Krushna Rever:నాగార్జున సాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 1 లక్షా 98 వేల 152 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో ప్రాజెక్టు 22 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు 1,72,194 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తంగా ఔట్ ఫ్లో 2 లక్షల 13 వేల 596 క్యూసెక్కులుగా ఉన్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587 అడుగులకు చేరింది.
Krushna Rever:నాగార్జున సాగర్ రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యం 306 టీఎంసీలుగా కొనసాగుతున్నది. ఎగువ నుంచి వస్తున్న వరద ఉధ్రుతితో శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతున్నది. శ్రీశైలం జలాశయం 5 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్ వైపు విడుదల చేస్తున్నారు.
Krushna Rever:శ్రీశైలం రిజర్వాయర్‌కు ఒక లక్షా 17 వేల 402 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. అదే విధంగా ఒక లక్షా 97 వేల 152 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 881 అడుగులకు చేరగా, రిజర్వాయర్‌లో 196 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది.

