Komatireddy Venkatreddy: సినిమా రంగంలో కొనసాగుతున్న వివాదాలపై మంత్రి కోమటిరెడ్డి పర్యవేక్షణలో ఫిల్మ్ ఫెడరేషన్ సభ్యుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సినిమా ఇండస్ట్రీలోని ఇరు పక్షాలు పట్టు, విడుపుతో వ్యవహరించాలని సూచించారు. సమస్యలు పరిష్కరించుకునేందుకు రేపు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు, ఫెడరేషన్ సభ్యులు కలిసి చర్చలు జరపాలని సూచించారు. ఫెడరేషన్ సభ్యులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు.