Musheer Khan

Musheer Khan: యువ క్రికెటర్ సంచలనం.. సెంచరీతో పాటు పదివికెట్లు!

Musheer Khan: ముంబైకి చెందిన యువ క్రికెటర్ ముషీర్ ఖాన్ తన ఆల్ రౌండర్ ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముంబైలో జరుగుతున్న ప్రతిష్టాత్మక కంగా లీగ్ లో ఒకే మ్యాచ్ లో అతను బ్యాటుతో 119 పరుగులు, బంతితో 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఈ అద్భుతమైన ప్రదర్శనతో అతను తన జట్టుకు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ముషీర్ ఖాన్, భారత క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ కు తమ్ముడు. గతంలో అండర్-19 ప్రపంచ కప్ లో అద్భుతమైన ప్రదర్శనతో అతను ఇప్పటికే భారత క్రికెట్ వర్గాల దృష్టిని ఆకర్షించాడు. ఇలాంటి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అతను భవిష్యత్తులో టీమిండియా తలుపులు తట్టే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్ఫరాజ్‌ కూడా అదిరిపోయే ప్రదర్శనలతో భారత టెస్ట్‌ అరీనా చుట్టూ ఉన్నాడు. అయితే సీనియర్లు క్రియాశీలకంగా ఉండటంతో అతనికి సరైన అవకాశాలు రావడం లేదు.

Also Read: AUS vs SA: సఫారీ బౌలర్లను ఊతికారేశాడు.. టిమ్ డేవిడ్ విధ్వంసం

2024లో జరిగిన అండర్-19 ప్రపంచ కప్ లో భారత జట్టు రన్నరప్ గా నిలిచింది. ఈ టోర్నమెంట్ లో ముషీర్ ఖాన్ రెండు సెంచరీలు సాధించి కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున అతనికి అవకాశం వచ్చింది. ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్ లో టీ20 ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన తొలి ఆటగాడిగా ముషీర్ ఖాన్ చరిత్ర సృష్టించాడు. ముషీర్ ఖాన్, అన్న సర్ఫరాజ్ ఖాన్ మాదిరిగానే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తూ, త్వరలోనే టీమిండియాలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముషీర్‌కు దేశవాలీ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో మంచి ట్రాక్‌ రికార్డు ఉంది. 2022-23 రంజీ సీజన్‌లో ముంబై తరఫున అరంగేట్రం చేసిన ముషీర్‌.. ఆడిన 9 మ్యాచ్‌ల్లో 51.14 సగటున 3 సెంచరీలు, ఓ హాఫ్‌ సెంచరీ సాయంతో 716 పరుగులు చేశాడు. ఇందులో ఓ అజేయ డబుల్‌ సెంచరీ కూడా ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Rishabh Pant: గాయపడిన రిషబ్ పంత్ 4వ టెస్ట్‌లో ఆడతాడా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *