Burglars: త్రిపురలోని సబ్రూమ్ ప్రాంతానికి చెందిన ఐదుగురిని అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినందుకు BSF అరెస్టు చేసింది. వీరిలో ముగ్గురు భారతీయ పౌరులు కాగా, ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు. బంగ్లాదేశ్ నుంచి త్రిపుర, అస్సాంల్లోకి చొరబాటు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
సరిహద్దు గ్రామమైన జల్కుంబాలో సరిహద్దును దాటుతున్నప్పుడు, BSF సైనికులు ఐదుగురిని చూశారని, ఆ తర్వాత వారిని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు సబ్రూమ్ సబ్-డివిజనల్ పోలీసు అధికారి నిత్యానంద సర్కార్ అందించిన వివరాల ప్రకారం ఐదుగురు వ్యక్తులలో, ముగ్గురు భారతీయులు, ఇద్దరు బంగ్లాదేశ్ పౌరులు ఉన్నారు. వారు అంతర్జాతీయ సరిహద్దును అక్రమంగా దాటడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు సబ్రూమ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
Burglars: ముగ్గురు భారతీయ పౌరులు బంగ్లాదేశ్‌కు దగ్గరి బంధువును కలిసేందుకు వెళ్లారని, అయితే అక్కడ నెలకొన్న అశాంతి కారణంగా ఇరుక్కుపోయారని ఆయన చెప్పారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో పరిస్థితి కొద్దిగా మెరుగుపడింది. ఆ తర్వాత వీరు సబ్రూమ్‌కు వస్తున్నారు. అయితే ఈ సమయంలో బీఎస్పీ జవాన్లు వారిని చూసి పట్టుకున్నారు. ప్రస్తుతం వీరిని విచారిస్తున్నారు.

