War 2: హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్2 అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వైఆర్‌ఎఫ్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతోంది. ఈ చిత్రం పోస్ట్ క్రెడిట్ సీన్‌లో ఆలియా భట్, శర్వరీ వాఘ్ కనిపించి, తదుపరి స్పై ఫిల్మ్ ఆల్ఫా కి లింక్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ సీన్ డిసెంబర్ 2025లో విడుదలయ్యే ఆల్ఫా కోసం హైప్ క్రియేట్ చేస్తుంది. అంతేగాక షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ కూడా ఈ సీన్‌లో ఉంటారని పుకార్లు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజం ఎంతో తెలియాలంటే రిలీజ్ రోజు దాకా ఆగాల్సిందే. వార్ 2 ఆగస్టు 14న గ్రాండ్ గా విడుదలవుతుంది.

