Pawan Kalyan: దేవాలయాలపై దాడి.. పవన్ రియాక్షన్ ఇదే

Pawan Kalyan: కెనడాలోని హిందూ ఆల‌యంలో భ‌క్తుల‌పై ఖ‌లిస్థానీ మ‌ద్ద‌తుదారులు దాడి చేసిన ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు.ఆయ‌న ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఆందోళన వ్యక్తం చేశారు. “పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌తో పాటు ఇటీవల బంగ్లాదేశ్ వంటి దేశాలలో మన హిందూ సోదరులు, సోదరీమణులు వేధింపులు, హింస, ఊహాతీతమైన బాధలకు గురికావ‌డం చాలా బాధ కలిగించింది. హిందువులు గ్లోబల్ మైనారిటీ. అందుకే వారు చాలా సులువుగా టార్గెట్ అవుతున్నారు. వారిపై ఈజీగా దాడుల‌కు పాల్ప‌డుతున్నారు.

also read: Gold rate: తగ్గుతున్న బంగారం ధర..

కెనడాలోని హిందూ ఆలయంపై, హిందువులపై జరిగిన దాడి హృదయాన్ని తాకింది. ఇది వేదన, ఆందోళన రెండింటినీ రేకెత్తించింది. కెనడా ప్రభుత్వం అక్కడ హిందూ సమాజానికి సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకు తక్షణ, నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నా. వివిధ దేశాలలో హిందువులపై హింసాత్మక ఘ‌ట‌న‌లు కొనసాగుతూనే ఉన్నాయి.

అయినప్పటికీ ప్రపంచ నాయకులు, అంతర్జాతీయ సంస్థలు, శాంతిని కోరుకునే ఎన్‌జీఓల నుంచి మౌనమే స‌మాధానం అవుతుంది. హిందువులకు సంఘీభావం ఎక్కడిది? ఈ అన్యాయాన్ని ఎదుర్కోవడానికి మనం ఎందుకు ఒంటరిగా మిగిలిపోయాం. ఎక్కడైనా, ఏ సంఘమైనా హింసకు గురికాకుండా, అచంచలమైన సంకల్పంతో ఐక్యంగా నిలబడదాం” అని జ‌న‌సేనాని త‌న‌ పోస్టులో పేర్కొన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Gold Rates Today: ఆగని బంగారం పరుగులు.. నిలకడగా వెండి ధర!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *