Ghaati Trailer: బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న అనుష్క శెట్టి (Sweety) కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఆమె ఇప్పుడు ‘ఘాటి’ అనే క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీతో మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతుంది.
ఈ చిత్రాన్ని టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అనుష్కతో పాటు తమిళ నటుడు విక్రమ్ ప్రభు, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ట్రైలర్ అంచనాలు పెంచేసింది
ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా రిలీజైన ట్రైలర్ అయితే ఆ అంచనాలను మరింత పెంచేసింది. గంజాయి మాఫియా నేపథ్యంలో కథ సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది.
“ఘాట్లలో గాటీలు ఉంటాయి సార్” అనే పవర్ఫుల్ డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమవ్వగా,“సీతమ్మోరు లంక దహనం చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం” అనే డైలాగ్ చివర్లో ఉండటం సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేసింది.
ఇది కూడా చదవండి: Harish Rao: ఢిల్లీలో రేవంత్ రెడ్డి అండ్ బ్యాచ్ డ్రామా అట్టర్ ఫ్లాప్
ట్రైలర్లో అనుష్కను చూస్తే మళ్లీ అరుంధతి ఫీల్ వచ్చింది. ఆమె వయోలెన్స్‌తో పాటు ఎమోషనల్ యాక్టింగ్‌తో Goosebumps తెప్పించింది. ఈ సినిమా కంటెంట్, యాక్షన్, ఎమోషన్స్ అన్నీ బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.
విడుదల తేదీ – సెప్టెంబర్ 5
ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ మూవీ పలు కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సెప్టెంబర్ 5న పాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
సంగీతం – నాగవెల్లి విద్యాసాగర్
ఈ చిత్రానికి నాగవెల్లి విద్యాసాగర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ట్రైలర్లో వినిపించిన BGM సినిమాకి అదనపు బలం అవుతుందని అంచనా.

