Karun Nair: భారత్, వెస్టిండీస్ తో అక్టోబర్‌లో స్వదేశంలో రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 2న అహ్మదాబాద్ లో ప్రారంభమవుతుంది. ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ లో కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడం వల్ల అతనిపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం. భారత పిచ్ లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయి కాబట్టి, జట్టులో అదనపు స్పిన్నర్ గా అక్షర్ పటేల్ ను తీసుకునే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న రిషబ్ పంత్ ఈ సిరీస్‌తో జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025-27 సైకిల్‌లో భాగంగా జరుగుతుంది. 2025లో టీమిండియా ఆడే చివరి టెస్ట్ సిరీస్ ఇదే కావడం గమనార్హం. ఆసియా కప్ ముగిసిన నాలుగో రోజుల వ్యవధిలోనే భారత్.. వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ ఆడనుంది. బీసీసీఐ త్వరలో జట్టును ప్రకటించనుంది.మొదటి టెస్ట్: అక్టోబర్ 2 – అక్టోబర్ 6 అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. రెండో టెస్ట్: అక్టోబర్ 10 – అక్టోబర్ 14, ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.
Also Read: Washington Sundar: ఇంపాక్ట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా వాషింగ్టన్ సుందర్
వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ టీమిండియా టెస్ట్ జట్టు అంచనా:
శుభ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్, ప్రసిధ్ కృష్ణ