Janhvi Kapoor

Janhvi Kapoor: జాన్వీ కపూర్ ని కోరివచ్చిన బంపరాఫర్

Janhvi Kapoor: అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ కపూర్. ధడక్ అనే హిందీ మూవీతో తెరంగ్రేటం చేసిన ఈ ముంబై బ్యూటీ ఫస్ట్ మూవీతోనే పాపులర్ అయింది. తొలి చిత్రంతోనే బాగా పాపులర్‌ అయిన జాన్వీకి సరైన హిట్స్‌ మాత్రం రాలేదని చెప్పాలి. అయితే ఆమె క్రేజ్‌ మాత్రం ఏమాత్రం తగ్గలేదు అలా దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి పలు ఆఫర్స్‌ రావడం మొదలెట్టాయి. దక్షిణాదిలో జాన్వీ నటించిన తొలి చిత్రం దేవర. జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన జాన్వీ కపూర్‌ నటించిన ఈ తెలుగు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను సాధించింది.

ఇప్పుడు ఈ అమ్మడు వరుస సినిమా ఆఫర్లతో దూ సుకుపోతోంది. ఇప్పటికే రామ్ చరణ్ మూవీలో ఆఫర్ కొట్టేసిన ఈ బ్యూటీ తాజాగా సౌత్ ఇండస్ట్రీ నుంచి మరో ఆఫర్ వచ్చిన ట్టు సమాచారం. కోలీవుడ్ మేకర్స్ జాన్వీని కావాలనే ఓ భారీ మూవీలో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

తమిళంలో సూపర్ హిట్టైన ‘ఈరం’ తెలుగులో వైశాలిగా రిలీజైన మూవీని హిందీలో రీమేక్ చేయబోతున్నారట. అందులో జాన్వీని తీసుకోవాలని మేకర్స్ డిసైడ్ అయ్యారని టాక్. డైరెక్టర్ శంకర్ ని ర్మించిన ఈ మూవీ మంచి కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈమూవీలో కొన్ని మార్పులు చేయాలని జాన్వీ మేకర్స్ ను కోరిందట. అందుకు మూవీ టీమ్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం.

2009లో విడుదలైన వైశాలి చిత్రంలో నటుడు ఆది పినిశెట్టి, నంద, సింధు మేనన్‌, శరణ్య మోహన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. 15 ఏళ్ల తర్వాత ఈ చిత్రం హిందీలో రీమేక్‌ కాబోతుంది. ఈ చితం ద్వారా ప్రముఖ ఛాయాగ్రాహకుడు మనోజ్‌ పరమహంస దర్శకుడుగా పరిచయం కానున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *