Anirudh: సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా అనిరుద్ ‘కూలీ’ గురించి సంచలన కామెంట్స్ చేశారు. సినిమా అద్భుతంగా వచ్చిందని, బ్లాక్‌బస్టర్ రిజల్ట్ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అనిరుద్ రివ్యూ సోషల్ మీడియాలో ఎమోజీలతో పోస్ట్ చేయకపోయినా, ఈ కామెంట్స్‌తో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది.
Also Read: Deepika Padukone: దీపికా సోషల్ మీడియా రికార్డ్.. 190 కోట్ల వ్యూస్!
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘కూలీ’ సినిమా ప్రపంచవ్యాప్తంగా హైప్ సృష్టిస్తోంది. నాగార్జున, అమీర్ ఖాన్, ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. సంగీత దర్శకుడు అనిరుద్ ఈ సినిమాపై తాజాగా రివ్యూ ఇచ్చారు. ‘కూలీ’ సూపర్బ్‌గా ఉందని, బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందని పేర్కొన్నారు. గతంలో జైలర్‌కు ఎమోజీ పోస్ట్‌తో హిట్ స్టాంప్ వేసిన అనిరుద్, ఈసారి నేరుగా కామెంట్స్‌తో ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.