Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్‌కు షాక్! మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజా సాబ్ సినిమా మరోసారి వాయిదా పడినట్లు సమాచారం. మాళవిక మోహనన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో డిసెంబర్ 5, 2025 అని రిలీజ్ డేట్ లేదు. దీంతో జనవరి 2026లో సినిమా విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. అభిమానులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా రెండోసారి వాయిదా పడితే, ఇది ఫ్యాన్స్‌కు కచ్చితంగా నిరాశ కలిగించే వార్త అవుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంపై అందరి దృష్టి నెలకొంది.
Also Read: Hansika: పెళ్లి ఫోటోలు డిలీట్ చేసిన హన్సిక!.. విడాకులు నిజమేనా?..
ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ హారర్-కామెడీ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఐదు భాషల్లో ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న ఈ సినిమా తాజా అప్‌డేట్ కోసం అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. వాయిదా వార్తలపై నిర్మాణ సంస్థ కచ్చితంగా స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో మరిన్ని ఆసక్తికర విషయాలు ఏమిటన్నది త్వరలో తెలియనుంది.

