Harish Rao

Harish Rao: రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిందని అంటాడు..రూ.6000 కోట్లకు టెండర్లు..

Harish Rao: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకవైపు కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైందని విమర్శలు చేస్తే, మరోవైపు అదే నీటిని వాడే గందమల్ల ప్రాజెక్టుకి కొబ్బరికాయ కొట్టడం ఎలా న్యాయమని** మాజీ మంత్రి హరీష్ రావు** ప్రశ్నించారు.

హరీష్ రావు వెల్లడి ప్రకారం,

మల్లన్నసాగర్‌ ప్రాజెక్ట్‌ కాళేశ్వరం భాగమే అన్నారు. కానీ అక్కడి నీటిని మూసీ నదిలోకి మళ్లించేందుకు రూ.6000 కోట్ల టెండర్లు ఫైనల్ చేశారు. ఇదంతా చూసినపుడు, “ఒకవైపు కాళేశ్వరం విఫలమైందంటూ మాట్లాడి, అదే ప్రాజెక్టు ఆధారంగా మరో పనుల్ని ఎలా చేయగలరు?” అని హరీష్ రావు రేవంత్ రెడ్డిని నిలదీశారు.

బేస్‌లెస్‌ రిపోర్ట్‌… అసలు నిజాలు బయటపెడతాం

తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీష్ రావు, కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కమిషన్ నివేదిక బేస్‌లెస్‌ అని స్పష్టం చేశారు.

600 పేజీల నివేదిక అసెంబ్లీలో పెట్టాలని డిమాండ్ చేశారు అయన. నిజాలు ప్రజల ముందు వెల్లడి చేస్తామని హెచ్చరించారు.  మాకు నోటీసులు రాకముందే లీకులు మీడియాకు ఇస్తున్నారు, ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని విమర్శించారు. అలాగే, గతంలో పోలవరం ప్రాజెక్టు మూడు సార్లు కూలినా NDSA (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) వెళ్ళలేదని, మేడిగడ్డలో చిన్నపాటి ఇసుక కదలికలకే ఆ సంస్థ రావడం వెనుక రాజకీయ కుట్ర ఉందన్నారు.

రెండేళ్లలో ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా?

హరీష్ రావు ముఖ్యంగా రైతుల పరిస్థితి గురించి చర్చిస్తూ, ‘‘రైతులకు ఎరువులు లేవు, నీళ్లు లేవు, పంటలు ఎండిపోతున్నాయి’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలో తొలి ఏడాదికే కరెంట్ కొరత లేకుండా చేశామని గుర్తు చేస్తూ, ‘‘ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో కొత్తగా ఒక్క ఎకరానికైనా నీరు ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు.

అలాగే, తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై ఎవరూ పనులు ఎందుకు చేయలేదో వివరించారు: అక్కడ నీటి లభ్యత లేకపోవడం, మహారాష్ట్ర నుంచి వన్యప్రాణులపై అభ్యంతరాలున్నాయని తెలిపారు.

ముద్దుగా కానీ, మూడుమాటలు చెప్తున్న సీఎం – హరీష్ రావు విమర్శ

హరీష్ రావు, ‘‘రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వరుసగా డ్రామాలు నడుపుతున్నారు, సీరియళ్లు తీశారు, అసలు పరిపాలన గాలికి వదిలేశారు’’ అని ఎద్దేవా చేశారు.కేసీఆర్‌ను టార్గెట్ చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని ఆరోపించారు.కానీ కేసీఆర్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచిపోతాయని స్పష్టంచేశారు.

మొత్తంగా, హరీష్ రావు మాటల్లో ప్రధానంగా కనిపించిన విషయం ఏమిటంటే – కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రైతులకు నీళ్లు అందించడమే తమ లక్ష్యం. అయితే ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో వాస్తవాలు లేవని, కేవలం రాజకీయ ప్రయోజనాలకే ఈ నివేదికను ఉపయోగిస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

ALSO READ  Uttam Kumar Reddy: KLIS ప్రాజెక్ట్ స్కామ్‌లో కేసీఆర్.. లక్ష కోట్ల నష్టం

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *