Delhi: ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో ఓ కారు రైడర్ రెడ్ సిగ్నల్ ను బ్రేక్ చేశాడు. అక్కడ ఉన్న ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు కారును ఆపేందుకు ప్రయత్నించగా, డ్రైవర్ వేగంగా కారు నడుపుతూ వారిని ఢీకొట్టాడు. పోలీసులు ఇద్దరూ కారు బానేట్ పై చిక్కుకుని ఉండిపోయినా డ్రైవర్ కారు ఆపలేదు. అలా దాదాపు 20 మీటర్ల మేర పోలీసులను ఈడ్చుకెళ్లాడు కారు రైడర్. ఈ సమయంలో ఓ పోలీసు కదులుతున్న కారుపై నుంచి కిందపడ్డాడు. కిందపడిన పోలీసు మళ్లీ లేచి కారు ఆపేందుకు ప్రయత్నించగా.. డ్రైవర్ మళ్లీ ఢీకొట్టి వెళ్లిపోయాడు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: తెలంగాణలో బీసీ కులగణనకు డెడికేషన్ కమిషన్
Delhi: పోలీసులు కారు యజమానిని గుర్తించి అతనిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగిని పనికి ఆటంకం కలిగించినందుకు కేసు నమోదు చేశారు. వసంత్ కుంజ్ నివాసి జై భగవాన్ పేరు మీద కారు రిజిస్టర్ అయివుంది.
ఢిల్లీ వసంత్ కుంజ్ ప్రాంతంలోని బెర్ సరాయ్ ట్రాఫిక్ లైట్ వద్ద ఈ ఘటన జరిగింది. ఎస్‌యూవీ కారు రెడ్ సిగ్నల్‌ను బ్రేక్ చేసి ముందుకు వెళ్ళింది. ఏఎస్సై ప్రమోద్, హెడ్ కానిస్టేబుల్ శైలేష్ చౌహాన్ ఆ సమయంలో అక్కడ విధుల్లో ఉన్నారు. కారు డ్రైవర్ సిగ్నల్ బ్రేక్ చేయగానే కారు రైడర్ ని ఆపమని పోలీసులు చెప్పారు. దీంతో కారు వేగం తగ్గినప్పటికీ ఒక్కసారిగా వేగం పెరిగింది. కారు ముందు నిలబడిన పోలీసులకు తప్పించుకునే అవకాశం లేకపోయింది. గాయపడిన ట్రాఫిక్ పోలీసులను ఆస్పత్రికి తరలించారు.
ये तो हाल है…
दिल्ली ट्रैफिक पुलिस के दो कर्मचारियों को कार की बोनेट पर झुला कर ये कोई सरफिरा है जो गाड़ी दौड़ा दिया… pic.twitter.com/ynE5Ts5KSc
— Ankit Kumar Avasthi (@kaankit) November 3, 2024