Hyderabad News: గోల్కొండ పరిసరాల్లో చిరుత సంచారం నిజమేనని తేలింది. అక్కడి సీసీ కెమెరాలో రోడ్డు దాటుతున్న చిరుత స్పష్టంగా కనిపించింది. తాజాగా గోల్కొండ వైపు నుంచి ప్రధాన రోడ్డు దాటుతూ అవతలివైపున ఉన్న మిలిటరీ ప్రాంతవైపు గోడ దూకి వెళ్తూ సీసీ కెమెరాలో రికార్డు అయింది. దీంతో గోల్కొండ, ఇబ్రహీంబాగ్ మిలిటరీ ప్రాంతాల్లో భయాందోళన నెలకొన్నది. ఈ మేరకు అటవీశాఖ అధికారులకు చిరుత సంచారంపై స్థానికులు, గోల్కొండ పోలీసులు సమాచారం ఇచ్చారు.
Hyderabad News: గత కొన్నాళ్లుగా మంచిరేవుల, నార్సింగి ప్రాంతాల్లో చిరుత సంచరిస్తున్న విషయంపై అప్రమత్తంగా ఉన్నారు. దీంతో గ్రేహౌండ్స్ ప్రాంతంలో నాలుగు బోన్లు, ట్రాప్ కెమెరాలను అధికారులు ఏర్పాటు చేసినా అది చిక్కలేదు. అక్కడి నుంచి తప్పించుకు తిరుగుతున్న ఆ చిరుతే ప్రస్తుతం గోల్కొండ, ఇబ్రహీంబాగ్ పరిసరాల్లో తిరుగుతున్నది. దానిని త్వరగా పట్టుకొని బంధించాలని స్థానికులు కోరుతున్నారు.