Peddi Reddy Swarnalatha

Peddi Reddy Swarnalatha: లక్షలాది తల్లులు, భార్యల కన్నీటికి ఏం సమాధానం చెప్తారు?

Peddi Reddy Swarnalatha: రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో ఉన్న ఎంపీ పెద్దిరెడ్డి మిధున్‌ రెడ్డితో కుటుంబ సభ్యుల, వైసీపీ నేతల ములాఖత్‌లు కొనసాగుతున్నాయి. ఆయన రిమాండ్‌కు వెళ్లాలి అనగానే… ఫైర్‌ స్టార్‌ హోటల్‌ సౌకర్యాలను తానుండే జైలు గదికి షిప్ట్‌ చేయాలని కోర్టులో పిటిషన్‌ పెట్టుకున్నారు. కోర్టు కూడా.. చట్టాలు చేసే పాలకుడు కదా.. కోరిన సౌకర్యాలు ఇవ్వలేరా? అంటూ జైలు అధికారులను ప్రశ్నించింది. అప్పటికే మిధున్‌రెడ్డి కోరిన కోరికలు తీర్చేకంటే.. ఆయన్ని నోవాటెల్‌లోనో, పార్క్‌ హయత్‌లోనో ఉంచితే సరిపోతుందన్న సలహా ప్రజల నుండే వచ్చింది. దాంతో భయపడిపోయిన జైలు అధికారులు.. అడిగినవి అన్నీ కాకున్నా, జైలులో ఇతర ఖైదీలకన్నా మిన్నగానే మిధున్‌ రెడ్డికి సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Quantam Vally vs Fishery: చికెన్‌ కొట్లు, చేపల చెరువు దగ్గరే ఆగిపోయిన వైసీపీ బ్రెయిన్స్‌

ఈ క్రమంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భార్య స్వర్ణలత తన కొడుకు మిధున్‌ రెడ్డిని చూసేందుకు సోమవారం జైలుకు వచ్చారు. కుమారుడిని కలిసి బయటకొచ్చిన స్వర్ణలత మీడియాతో మాట్లాడుతూ… జైలు అధికారులు తన కొడుకును బాగా చూసుకుంటే బాగుంటుందని, లిక్కర్‌ కేసులో తన కొడుకు నిందితుడు మాత్రమే కానీ నేరస్తుడు కాదనీ, అయినా జైలు అధికారులు తన కొడుకును టెర్రరిస్టులా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక తల్లిగా ఆమె వ్యక్తం చేసిన ఆవేదనని అర్థం చేసుకోవచ్చు కానీ… మిధున్‌ రెడ్డి కీలకం మారి నడిపించారంటున్న లిక్కర్‌ స్కామ్‌ వల్ల పాతిక వేల కోట్ల ప్రజా సంపదతో పాటూ లక్షలాది మంది లివర్లు, కిడ్నీలు పాడై.. వారి తల్లులకు కడుపుకోత, భార్యలకు జీవితకాల శిక్ష ఇప్పటికే అనుభవిస్తున్న విషయం ఆవిడకు ఏమాత్రం అక్కర్లేదేమో అనిపిస్తోంది. కొడుకు తోట కూర దొంగలించినప్పుడే తల్లి మందలించి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్న సామెత.. ఇక్కడ గుర్తుకొస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *