Simbu: శింబు హీరోగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘బ్లడ్ అండ్ బ్యాటిల్’ సినిమా ఆగిపోయిందనే వార్తలు వచ్చాయి. 8 నెలల క్రితం దేశింగ్ పెరియసామి దర్శకత్వంలో ప్రకటించబడ్డ ఈ సినిమా ఇప్పుడు చేతులు మారనుంది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం ఇప్పటి వరకూ దాదాపు 6 కోట్లు ఖర్చు చేశారు కమల్. అయితే కమల్ తో కలసి ‘థగ్ లైఫ్’లో నటిస్తున్నాడు శిలంబరసన్. ఆ సినిమా కోసం తన పారితోషికం వాటా నాలుగు కోట్లను కమల్ కు చెల్లించాడట శింబు. అంతే కాదు త్వరలో మరో కోటి కూడా చెల్లించనున్నాడట.
ఇది కూడా చదవండి: Devara OTT Release Date: దేవర ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే..
Simbu: ఇక కమల్, శింబు మధ్య ఉన్న అండర్ స్టాండింగ్ కారణంగా కోటి రూపాయలను కమల్ వదిలేసుకున్నాడట. దీంతో ఇప్పుడు ‘బ్లడ్ అడ్ బ్యాటిల్’ శింబు చేతికి వచ్చింది. ఈ కథపై నమ్మకంతో శింబు ప్రీ ప్రొడక్షన్ కోసం భారీగా ఖర్చు పెడుతున్నాడట. ప్రస్తుతం ‘థగ్ లైఫ్’ పూర్తి అయిన వెంటనే అశ్వత్ మరిముత్తు సినిమా చేయనున్నాడు శింబు. ఆ తర్వాత చేయబోయేది ‘బ్లడ్ అండ్ బ్యాటిల్’ సినిమానే అట. దీని అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. శింబుకు తెలుగునాట ఉన్న గుర్తింపుతో ఇది తెలుగులోనూ రూపొందనుందట. మరి రాబోయే సినిమాలతో శింబు ఏ స్థాయి విజయాలను అందుకుంటాడో చూడాలి.