Mancherial: ఆ యువతికి పెళ్లయి నాలుగేళ్లయింది.. కాపురానికి వెళ్లిన కొంతకాలానికే గొడవల కారణంగా పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉన్నది.. వివాదం కొనసాగుతుండగానే, ఓ రోడ్డు ప్రమాదంలో తండ్రి సహా ఆ యువతికి తీవ్రగాయాలై ఇద్దరూ చనిపోయారు. ఇప్పడు ఆమె తల్లి, ఇతర కుటుంబ సభ్యులు పెళ్లి కానుకలుగా ఇచ్చిన తామిచ్చిన భారీ వరకట్నాన్ని తమకు ఇచ్చేయాలంటూ ఆ యువతి అత్తింటి ఎదుట ఆందోళనకు దిగారు. ఒకరోజు కాదు.. అంబులెన్స్‌లోనే మృతదేహాన్ని ఉంచి ఏకంగా రెండు రోజులపాటు నిరసనకు దిగారు. పోలీసుల సూచనతో ఆ వివాదం సద్దుమణిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Mancherial: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన సింగరేణి కార్మికుడు సురేశ్, లావణ్య (29) మధ్య వివాహం జరిగింది. పెళ్లయిన కొద్దిరోజులకే ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయి. ఆ తర్వాత లావణ్య పుట్టింటికి వెళ్లిపోయింది. గొడవ సద్దుమణగక ముందే ఈ నెల (జూలై) 16న తన తండ్రితో కలిసి లావణ్య బైక్‌పై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఆమె తండ్రి అక్కడికక్కడే చనిపోయాడు. లావణ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జూలై 24న కన్నుమూసింది.
Mancherial: ఆ మరునాడు లావణ్య మృతదేహంతో ఆమె భర్త సురేశ్ ఇంటి ఎదుట మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. వరకట్నంగా తామిచ్చిన కానుకలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారం తిరిగి ఇచ్చేయాలని కోరుతూ రెండు రోజులపాటు మృతదేహాన్ని అంబులెన్స్‌లోనే ఉంచి ఆందోళనకు దిగారు.
Mancherial: వరకట్నం తిరిగిస్తేనే తాము లావణ్య అంత్యక్రియలు నిర్వహిస్తామని భీష్మించుకొని సురేశ్ ఇంటి ఎదుటే కూర్చొని ఉన్నారు. ఈ లోగా అక్కడికి చేరుకున్న పోలీసులు విషయంపై ఆరా తీశారు. లావణ్య తల్లికి, ఇతర కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి, అంత్య క్రియలు జరపాలని ఒప్పించారు. ఇతర విషయాలు తర్వాత మాట్లాడుదామని చెప్పి పంపారు.