SRT Entertainment

SRT Entertainments: ఒకే నెలలో ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ మూడు చిత్రాలు

SRT Entertainments: నవంబర్ నెలలో మూడు చిత్రాలతో రాబోతోంది ఎస్.ఆర్.టి ఎంటర్ టైన్ మెంట్స్. ఈ సంస్థ అధినేతలు రామ్ తాళ్ళూరి, రజనీ తాళ్లూరి. తమ సంస్థ ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్‌ మెంట్స్ పై నవంబరు 14న వరుణ్ తేజ్ ‘మట్కా’ను రిలీజ్ చేస్తున్నారు. ఈ పీరియాడికల్ చిత్రంకు కరుణ కుమార్ దర్శకత్వం వహించగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఇక విశ్వక్ సేన్ తో రవితేజ ముళ్ళపూడి దర్శకత్వంలో నిర్మించిన ‘మెకానిక్ రాకీ’ సినిమాను నవంబరు 22న రిలీజ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Surya – Karthi: సూర్య, కార్తీ తో మైత్రీ మల్టీస్టారర్..?

ఈ హిలేరియస్ ఎంటర్ టైనర్ లోనూ మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా మరో  హీరోయిన్ గా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. ఇక ప్రదీప్ మద్దాలి దర్శకత్వంలో నరేశ్ అగస్త్య నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘వికటకవి’ని ఈ నెల 28న జీ5లో డైరెక్ట్ గా రిలీజ్ చేస్తున్నారు. ఇలా మూడు జానర్స్ కి చెందిన మూడు చిత్రాలతో ఒకే నెలలో రానుండటం అరుదైన విషయం. ఇవి కాకుండా మరి కొన్ని ప్రాజెక్ట్ లను లైన్ పెట్టింది ఎస్.ఆర్.టి. ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ. ఇలాంటి అరుదైన రికార్డ్ తో వస్తున్న నిర్మాతలు రామ్ తాళ్ళూరి, రజనీ తాళ్ళూరి రాబోయే మూడు చిత్రాలతో ఏ స్థాయి విజయాలను అందిపుచ్చుకుంటారో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *