Kaushik Reddy: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
కాంగ్రెస్ ఫిర్యాదు ఆధారంగా చర్య
కౌశిక్‌రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సీఎం ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఉన్నాయని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఈ మేరకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ ఫోన్లను ట్యాప్ చేయిస్తున్నారని, ప్రైవేట్ హ్యాకర్లను ఉపయోగించి సినీ ఇండస్ట్రీ ప్రముఖుల ఫోన్లు, హీరోయిన్ల ఫోన్లను కూడా హ్యాక్ చేయిస్తున్నారని ఆయన విమర్శించారు.
ఇది కూడా చదవండి: Chandrababu: పెట్టుబడులే లక్ష్యం.. సింగపూర్కు సీఎం చంద్రబాబు
పాడి కౌశిక్‌రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన వాక్యాలు..
కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి స్వయంగా ఫోన్లు ట్యాప్ చేస్తున్నట్లు చెప్పారని ఆరోపించారు. గతంలో కెసిఆర్, కెటిఆర్, హరీష్‌రావు ఎప్పుడూ ఫోన్ ట్యాపింగ్ చేయలేదని, అయితే రేవంత్ మాత్రం ఢిల్లీలో జరిగిన చిట్‌చాట్‌లో ఫోన్ ట్యాపింగ్ సాధారణ విషయం అని అన్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అవుతున్నాయని ఆయన తెలిపారు.
మిస్ వరల్డ్ పోటీలకు వచ్చిన వారి ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. మై హోం భుజాలో సిఎం ఎవరిని కలిశారో కూడా తమకు తెలుసని సంచలన వ్యాఖ్య చేశారు. “సిఎం రేవంత్ చరిత్ర అంతా నాకు తెలుసు” అని ఆయన అన్నారు.
ఇది కూడా చదవండి: Varun Tej: కన్ ఫ్యూజన్ లో వరుణ్ తేజ్.. పుట్టబోయే బేబీ కోసం..
రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఇడి, సిబిఐ విచారణ జరగాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాను పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తన ఫోన్, తన భార్య ఫోన్ హ్యాక్ అంశంపై పోలీసులు కేసు నమోదు చేయలేదని ఆయన విమర్శించారు.
కేబినెట్ మీటింగ్ శుక్రవారం జరగాల్సి ఉందని, కానీ మంత్రులు ఢిల్లీలోకి వెళ్లి పెద్ద పంచాయతీ పెట్టారని ఆయన ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తేల్చేవరకు కేబినెట్ మీటింగ్ రాదని మంత్రులు చెప్పారని తెలిపారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పెద్దలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా ఆగ్రహంగా ఉన్నారని కౌశిక్‌రెడ్డి అన్నారు.

