Supreme Court Of India: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన పిటిషన్‌ను శుక్రవారం (జూలై 25) సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది. దీంతో ఇప్పట్లో పునర్విభజన అంశం లేనట్టేనని తేలిపోయింది. ఒకవేళ పార్లమెంట్‌లో చట్టం చేస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి పునర్విభజన ఉండొచ్చన్న అంశంపైనా సరైన క్లారిటీ లేదని తెలుస్తున్నది.
Supreme Court Of India: ఏపీ విభిజన చట్టం సెక్షన్ 26 ప్రకారం.. నియోజకవర్గాల పునర్విభజన చేయాలని 2022లో హైదరాబాద్‌కు చెందిన ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి సుప్రీంకోర్టులో గతంలో పిటిషన్ వేశారు. జమ్ముకశ్మీర్ పునర్విభజన చేసే సమయంలో ఏపీ విభజన చట్టాన్ని పక్కన పెట్టినట్టు పిటిషన్ పురుషోత్తంరెడ్డి పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గ పునర్విభజన పిటిషన్‌ను అనుమతిస్తే ఇతర రాష్ట్రాల నుంచి ఇదే అంశంపై పిటిషన్లు వరదలా వస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. అందుకే ఈ పిటిషన్‌ను డిస్విస్ చేస్తున్నట్టు పేర్కొన్నది.