Plane Crash: రష్యాలో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. అంగారా ఎయిర్‌లైన్స్‌కు చెందిన AN-24 విమానం 49 మందితో ప్రయాణిస్తుండగా అమూర్ ప్రాంతంలో కుప్పకూలింది.
ఎలా జరిగింది ప్రమాదం?
గురువారం ఉదయం ఈ విమానం బ్లాగోవెష్‌చెన్స్క్ నుంచి చైనా సరిహద్దు ప్రాంతానికి సమీపంలోని టిండా విమానాశ్రయానికి బయలుదేరింది. ల్యాండింగ్‌కు కేవలం 15-16 కిలోమీటర్ల దూరంలో ఉండగా అకస్మాత్తుగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. వెంటనే రష్యన్ అత్యవసర సిబ్బంది వెతకడం ప్రారంభించారు.
కొద్దిసేపటికే టిండా ప్రాంతానికి సమీపంలోని కొండ ప్రాంతంలో విమానం శిథిలాలను గుర్తించారు. అక్కడ పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నట్లు రెస్క్యూ సిబ్బంది తెలిపారు.
ఎంతమంది ప్రయాణికులు?
ప్రమాద సమయంలో విమానంలో 43 మంది ప్రయాణికులు మరియు 6 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులలో 5 మంది చిన్నారులు కూడా ఉన్నారని అమూర్ ప్రాంత గవర్నర్ వాసిలీ ఓర్లోవ్ తెలిపారు.
ఇది కూడా చదవండి: Revanth Reddy: ఫోన్ ట్యాపింగ్‌పై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
ప్రమాదానికి కారణం?
ప్రాథమిక సమాచారం ప్రకారం, విమానం మొదట ల్యాండింగ్ ప్రయత్నం చేసినా వాతావరణ పరిస్థితులు అనుకూలించలేదు. రెండోసారి ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా రాడార్ నుండి అదృశ్యమై కూలిపోయిందని అధికారులు పేర్కొన్నారు.
రక్షక చర్యలు కొనసాగుతున్నాయి
రష్యన్ అత్యవసర మంత్రిత్వ శాఖ ప్రకారం, కాలిపోతున్న విమాన భాగాలను హెలికాప్టర్ ద్వారా గుర్తించారు. సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని రక్షక చర్యలు చేపడుతున్నారు. ప్రాణనష్టంపై ఇంకా స్పష్టమైన వివరాలు తెలియాల్సి ఉంది.

