Devara 2: దేవర: పార్ట్ 1తో బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రెండో భాగం కోసం సన్నాహాలు చేస్తున్నారు. కొరటాల శివ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసి, ఎన్టీఆర్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్ 2, ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. మరోవైపు, త్రివిక్రమ్-వెంకటేష్ కాంబోలో ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ తెరకెక్కనుంది. ఈ సినిమా 2026 వేసవిలో విడుదల కానుంది.
Also Read: Abbas: సంచలనం.. రీఎంట్రీ ఇస్తున్న అబ్బాస్!
ఆ తర్వాత త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు మొదలవుతాయి. ఈ షెడ్యూల్ మధ్యలో దేవర 2 కోసం ఎన్టీఆర్ దాదాపు తొమ్మిది నెలల సమయం కేటాయించే అవకాశం ఉందని టాక్. కొరటాల శివ ఈ గ్యాప్‌లో సీక్వెల్‌ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 2026 దసరా లేదా డిసెంబర్‌లో దేవర 2 విడుదలయ్యే ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.


