Anil Kumar: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో, వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. కోవూరు టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిపై విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన వ్యవహారంలో అనిల్‌పై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఈనెల 26న కోవూరు పీఎస్‌లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అనిల్ అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటికి నోటీసులు అంటించారు. కాగా, ఎల్లుండి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు.
నోటీసులపై అనిల్ కుమార్ యాదవ్ ఇంకా అధికారికంగా స్పందించలేదు. అయితే, వైసీపీ నాయకులు తరచుగా తమపై రాజకీయ కుట్ర జరుగుతోందని ఆరోపిస్తుంటారు. అంతకుముందు రోజు నెల్లూరు జిల్లాలో కోవూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో మాజీ ఎమ్మెల్యేకు కోవూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Russian Plane: 50 మంది ప్రయాణికులతో మాయమైన రష్యా విమానం..
ఈ నెల 25న విచారణకి హాజరు కావాల్సిందిగా SI రంగనాథ్ గౌడ్ నోటీసులు అందజేశారు. అ సభ్యకర పదజాలంతో మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్నరెడ్డి ఆరోపణలు చేయడంపై హైకోర్టు కూడా సీరియస్ అయింది. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజు తనను తాను సమర్థించుకుంటూ ప్రసన్నకుమార్ స్టేట్ మెంట్ ఇవ్వడాన్ని ఖండిస్తూ.. బెయిల్ మంజూరు చేసేందుకు నిరాకరించింది. BNS లోని 35(3) ప్రకారం నోటీసులు ఇచ్చి విచారించారని ఆదేశాలు జారీ చేసింది.