Air Pollution: ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించి ఓ సర్వే నిర్వహించగా, అందులో షాకింగ్ గణాంకాలు వెలువడ్డాయి. NDTV ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో 69% కుటుంబాలు కాలుష్యం బారిన పడుతున్నారని ప్రైవేట్ ఏజెన్సీ లోకల్ సర్కిల్ సర్వే పేర్కొంది.ఈ సర్వేలో 21 వేల మంది నుంచి డేటా తీసుకున్నారు. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లోని 62% కుటుంబాల్లో కనీసం 1 సభ్యుని కళ్లలో మంట ఉన్నట్లు వెల్లడైంది.
ఇది కూడా చదవండి: Anakapalli: ష్.. ఎంపీడీవో సార్ నిద్రపోతున్నారు.. డోంట్ డిస్టర్బ్
Air Pollution: అదే సమయంలో, 46% కుటుంబాలలో, కొంతమంది సభ్యులు జలుబు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 31% కుటుంబాలలో, ఒక సభ్యుడు ఆస్తమాతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితికి ఈ సర్వే అడ్డం పడుతోంది.