Kingdom: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “కింగ్‌డమ్” సినిమా ట్రైలర్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 26న తిరుపతిలోని నెహ్రూ స్టేడియంలో భారీ ఈవెంట్‌తో ట్రైలర్ విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో విజయ్ దేవరకొండ తీవ్రమైన రోల్‌లో కనిపించనున్నారు. ట్రైలర్ పోస్టర్‌లో వీరతిలకంతో విజయ్ స్టిల్ అభిమానుల ఆసక్తిని రెట్టింపు చేస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.
Also Read: Akhanda 2: అఖండ 2: అభిమానులకు మరో స్టన్నింగ్ సర్ప్రైజ్!
భాగ్యశ్రీ భోర్సే హీరోయిన్‌గా నటిస్తుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అభిమానుల్లో ఉత్సాహం నింపే ఈ ట్రైలర్ ఈవెంట్ సినిమాపై అంచనాలను ఆకాశానికి తాకేలా చేయనుంది.