Peddi Reddy: ఏపీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన వైసీపీ పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆయనను కలిసేందుకు వైసీపీ సీనియర్ నేతలు వరుసగా జైలు ముఖం పట్టడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది.
నిన్న జైలు అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో మిథున్ రెడ్డిని కలిసి మాట్లాడారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ మార్గాని భరత్, మాజీ హోం మంత్రి తానేటి వనిత కూడా జైలుకు వెళ్లారు.
భారీ భద్రత – ప్రత్యేక అనుమతులు
ఈ సందర్శనకు ముందుగానే రాజమండ్రి సెంట్రల్ జైలులో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. జైలు పరిసరాల్లో 144 సెక్షన్, సెక్షన్ 30 అమల్లోకి తీసుకొచ్చారు. అయితే జైలు ప్రాంగణంలోకి కేవలం పెద్దిరెడ్డి వాహనానికే అనుమతి ఇవ్వడం గమనార్హం. ఇతర నేతలు కూడా అదే వాహనంలో వెళ్లాల్సి వచ్చింది.
ఇది కూడా చదవండి: Chandrababu Naidu: ఆగస్టు 15 నాటికి ఆన్‌లైన్‌లోనే అన్ని సేవలు : చంద్రబాబు
రాజకీయాల్లో సందేశమా?
మిథున్ రెడ్డి అరెస్టు తర్వాత వైసీపీ ప్రధాన నేతలు వరుసగా జైలుకు వెళ్లడం పలు ఊహాగానాలకు దారితీస్తోంది. ఇది కేవలం స్నేహపూర్వకంగా ఆత్మీయంగా కలవడమేనా? లేక పార్టీ తరపున మిథున్ రెడ్డికి బలమైన మద్దతు ఉందని ప్రజలకు సంకేతం ఇవ్వడమేనా? అనే ప్రశ్నలు లేవుతున్నాయి.
ప్రజల్లో చర్చ
ఈ కేసు రాజకీయ మలుపులు తిరుగుతుందా? వైసీపీ నేతల ఈ చర్యపై విపక్షం ఎలా స్పందిస్తుందో అన్నదానిపై రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.