America: జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన సెక్స్ కుంభకోణం దుమారం రేపుతున్న సమయంలో నటి మారియా ఫార్మర్ మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు.
1995లో జెఫ్రీ ఎప్స్టీన్ ఆఫీసులో జరిగిన ఓ ఘటనను గుర్తు చేస్తూ మారియా మాట్లాడుతూ… ఆ రోజు రాత్రి ట్రంప్ తాను వేసుకున్న నైట్డ్రెస్లో ఉన్న తనను అదో విధంగా చూసినట్లు ఆరోపించారు. “ఆ రోజు రాత్రి ఎప్స్టీన్ అర్జెంటుగా ఆఫీసుకు రావాలని ఫోన్ చేశాడు. నైట్డ్రెస్లోనే వెళ్లాను. అక్కడికి వెళ్లేసరికి ట్రంప్ అక్కడే ఉన్నాడు. అప్పట్లో నేను షార్ట్స్ వేసుకున్నాను. ట్రంప్ కాళ్లవైపు చూపులు మళ్లిస్తూ విచిత్రంగా చూస్తూ ఉన్నాడు,” అని ఆమె చెప్పారు.
ఈ ఘటన జరిగిన సమయంలో తన వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమేనని, తాను అప్పుడు ఎప్స్టీన్తో కలిసి పనిచేయాలని సిద్ధమవుతుండగా ఈ పరిణామం చోటుచేసుకుందని వివరించారు. అంతలో అక్కడికి వచ్చిన ఎప్స్టీన్, ట్రంప్‌ను ఉద్దేశిస్తూ – “నో నో.. ఆమె నీ కోసం కాదు,” అని అన్నాడని మారియా వెల్లడించారు.
మారియా ఫార్మర్ ఇప్పటికే 1996లోనే ఎప్స్టీన్ మరియు గిలైన్ మ్యాక్స్వెల్లపై గంభీర ఆరోపణలు చేశారు. వారు మైనర్లను లక్ష్యంగా చేసుకుని సెక్స్ ట్రాఫికింగ్ చేస్తున్నారంటూ మీడియాలో వివరించారు.
ఈ వ్యవహారంపై ప్రస్తుతం మారియా ట్రంప్‌పై ఆరోపణలు చేయడంతో మళ్లీ చర్చ మొదలైంది. మారియా వ్యాఖ్యలపై స్పందించిన వైట్ హౌస్, ట్రంప్ ఎప్పుడో ఎప్స్టీన్తో తన స్నేహాన్ని ముగించారని, ఆయన ఎప్పుడూ ఎప్స్టీన్ ఆఫీసుకు వెళ్లలేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని వైట్ హౌస్ కమ్యూనికేషన్ డైరెక్టర్ స్టీవెన్ తెలిపారు.

