Crime News: సాంబార్‌లో విషం కలిపి ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటనను మరువక ముందే మరో మహిళ తన భర్తను చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇటీవల పలువురు మహిళలు తమ భర్తలను చంపిన ఘటనలు వరుసగా చోటుచేసుకుంటుడం ఆందోళన కలిగిస్తున్నది. ఇదే కోవలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
Crime News: మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లా నలసోపర ప్రాంతంలోని సాయి వెల్ఫేర్ సొసైటీలో భార్యాభర్తలైన కోమల్ చవాన్, విజయ్ చవాన్ నివాసం ఉంటున్నారు. అయితే విజయ్ చవాన్ గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. దీంతో అనుమానం వచ్చిన విజయ్ చవాన్ సోదరులు కోమల్ చవాన్‌ను నిలదీశారు. అయితే నిజం చెప్పలేదు.
Crime News: అయితే కోమల్ చవాన్ తన ప్రియుడు మోనుతో కలిసి తిరగడాన్ని పసగిట్టారు. దాంతోపాటు ఆ ఇంటిని పరిశీలించారు. ఓ గదిలో టైల్స్ రంగు మారి ఇతర టైల్స్‌కు భిన్నంగా ఉండటాన్ని గమనించారు. దాంతో అనుమానంతో ఆ టైల్స్‌ను తొలగించి తవ్వగా మృతదేహం బయటపడింది. దీంతో కోమల్ చవాన్, ఆమె ప్రియుడు మోను నిర్వాకం బయటపడింది. విజయ్ చవాన్ సోదరుల ఫిర్యాదు మేరకు పోలీసులు కోమల్ చవాన్ తన భర్తను తన ప్రియుడు మోను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

