Earthquake:హర్యానా రాష్ట్రాన్ని భూకంపం భయపెడుతున్నది. తరచూ భూ ప్రకంపనలతో ఆ రాష్ట్ర ప్రజలు భయకంపితులవుతున్నారు. తాజాగా మంగళవారం (జూలై 22) తెల్లవారుజామున ఆ రాష్ట్రంలని ఫరీదాబాద్‌లో భూకంపం మరింత ఆందోళన కలిగిస్తున్నది. భూకంప తీవ్రత 3.2గా నమోదైంది. అదే సమయంలో ఢిల్లీ నగరంలోనూ భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.
Earthquake:భూకంపం సమయంలో ఫరీదాబాద్‌లో జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 6.08 గంటలకు 5 కిలోమీటర్ల లోతులో భూ ప్రకంపనలు ఉత్పన్నమయ్యాయని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ప్రజలు నిద్రలో ఉండగానే ప్రకంపనలు చోటుచేసుకోవడంతో నిద్రలో ఉన్నవారంతా బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో ప్రజలు భయకంపితులయ్యారు.