Vijay Deverakonda, Rashmika: టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మక మందన్నకు పెళ్లి జరిగిందా? ఎవరికీ తెలియకుండా ఇరు కుటుంబాలే హాజరయ్యాయా? లేదా ఎంగేజ్‌మెంట్ కుదిరిందా? ఎన్నాళ్ల నుంచో ఉన్నఅనుమానాలు పటాపంచెలయ్యాయా? అంటే నిజమే కావచ్చు.. అని సినీ జనాలే కాదు.. ప్రేక్షక జనాలు కూడా భావిస్తున్నారు. ఇద్దరూ సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపించిన ఫొటోలే దీనికి ప్రధాన ఆధారంగా కనిపిస్తున్నది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Vijay Deverakonda, Rashmika: గీతా గోవిందం సినిమా నుంచి క్రేజీ జంటగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ ప్రేమలో పడ్డారని, త్వరలో వీరి పెళ్లి జరుగుతుందని ఎన్నో ఊహాగానాలు నడిచాయి. డియర్ కామ్రేడ్ సినిమాతో వీరిద్దరి రిలేషన్ మరింత బలపడిందని చెప్తారు. వీరు ఎక్కడ కలుసుకున్నా డీప్‌గా మెలిగేవారు. అది ప్రేమేనని జనం భావిస్తూ వచ్చారు.
Vijay Deverakonda, Rashmika: తాజాగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా సంప్రదాయ పెళ్లి దుస్తుల్లో కనిపించిన ఫొటోలు వైరల్‌గా మరాయి. వధూవరుల మాదిరిగా పూల దండలతో వారిద్దరూ కనిపించడంతో నిజంగానే వీరు పెళ్లి చేసుకున్నారనే చర్చ జరుగుతున్నది. రష్మిక నుదుటన సిందూరం, విజయ్ షేర్వాణీ వంటివి పెళ్లికి సూచికలు కనిపిస్తున్నాయని చెప్తుననారు. మరి ఇలాంటి సమయంలో ఈ జంట మాత్రమే స్పందించాల్సి ఉన్నది. వారిద్దరి స్పందనతో అనుమానాలన్నీ పటా పంచెలు కానున్నాయి. నిజంగా పెళ్లి జరిగిందా? ఎంగేజ్‌మెంట్ కుదిరిందా? లేదా ఎవరైన రూమర్స్ పుట్టించారా? అన్నది వారే తేల్చాల్సి ఉన్నది.