Mahedi Hasan

Mahedi Hasan: హర్భజన్ సింగ్ 13 ఏళ్ల రికార్డు బద్దలు.. రికార్డు సృష్టించిన బంగ్లాదేశ్ ఆల్ రౌండర్!

Mahedi Hasan: భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ 13 ఏళ్ల రికార్డును బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ మెహెది హసన్ బద్దలు కొట్టాడు. కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో శ్రీలంకతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో మెహెది హసన్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో ఈ రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. మెహెది హసన్ తన 4 ఓవర్లలో కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు (4-1-11-4).

ఇందులో ఒక మెయిడెన్ ఓవర్ కూడా ఉంది. గతంలో ఈ వేదికపై అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు హర్భజన్ సింగ్ పేరు మీద ఉన్నాయి. 2012 టీ20 ప్రపంచ కప్‌లో హర్భజన్ ఇంగ్లాండ్‌పై 12 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశారు (4-2-12-4). కాగా ఈ విజయంతో, బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకపై T20I సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది.

ఇది కూడా చదవండి: Brian Lara: ఐపీఎల్ వల్ల వెస్టిండీస్ క్రికెట్ నాశనం : బ్రియన్ లారా

1. మెహెదీ హసన్ (బంగ్లాదేశ్): 4-1-11-4 vs శ్రీలంక, జూలై 2025
2. హర్భజన్ సింగ్ (భారతదేశం): 4-2-12-4 vs ఇంగ్లాండ్, సెప్టెంబర్ 2012
3. జోష్ హాజిల్‌వుడ్ (ఆస్ట్రేలియా): 4-0-16-4 vs శ్రీలంక, జూన్ 2022
4. జో డెన్లీ (ఇంగ్లాండ్): 4-0-19-4 vs శ్రీలంక, అక్టోబర్ 2018
5. ముస్తాఫిజుర్ రెహ్మాన్ (బంగ్లాదేశ్): 3-0-21-4 vs శ్రీలంక, ఏప్రిల్ 2017
6. భువనేశ్వర్ కుమార్ (భారత్ ): 3.3-0-22-4 vs శ్రీలంక, జూలై 2021
7. శార్దూల్ ఠాకూర్ (భారత్): 4-0-27-4 vs శ్రీలంక, మార్చి 2018

ఇక నిర్ణయాత్మక మూడవ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ శ్రీలంకను 8 వికెట్ల తేడాతో ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు మాత్రమే చేయగలిగింది. 133 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ 16.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *