GNT Ananthavarampadu

GNT Ananthavarampadu: గత ఐదేళ్లు గ్రామీణాభివృద్ధి మంత్రి ఎవరో తెలుసా?

GNT Ananthavarampadu: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పవన్‌ కళ్యాణ్‌ పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గ్రామాల రూపు రేఖలు మారిపోతున్నాయి. గత వైసీపీ హయాంలో డీబీటీ పథకాలు తప్ప, గ్రామాల్లో అభివృద్ధి జాడే లేకుండా పోయింది. కేంద్ర ప్రభుత్వంతో సరిగ్గా సమన్వయం చేసుకోగలిగిన వ్యవస్థ లేదు. నిధుల కోసం వెంపర్లాడటం ఎక్కడా కనిపించదు. అసలు గ్రామాలకు సంబంధించి, వాటి అభివృద్ధికి సంబంధించి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి సంబంధించి వైసీపీ హయాంలో అసలు ప్రపోజల్స్‌ లేనే లేవు. అసలు వైఎస్ఆర్‌సీపీ హయాంలో 2019 నుండి 2024 వరకూ గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పని చేసింది ఎవరో రాష్ట్రంలో ఎవరికీ పెద్దగా తెలియదు. ఇంతకీ ఆ పనిమంతుడు ఎవరనుకున్నారు? అటవీ భూములు, ప్రభుత్వ భూములు కబ్జా పెట్టడంలో ఐదేళ్లు తలమునకలైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నేడు పవన్‌ కళ్యాణ్‌ నేతృత్వంలో పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల సత్తా ఏంటో ప్రజలు, పాలకులు కళ్లారా చూస్తున్నారు.

Also Read: AP News: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ : తోతాపురి మామిడికి రూ. 260 కోట్లు విడుదల

పంట పండించే రైతుకు పాడి కూడా చాలా ముఖ్యం. మనకు తలదాచుకునేందుకు ఇళ్లు ఎంత ముఖ్యమో, ఎండా వాన నుండి పాడి పశువులకు కాపాడుకునేందుకు వాటికీ ఓ షెడ్డు అవసరం. ఆ ఖర్చు కూడా రైతుకు తగ్గించేందుకు గోకులం షెడ్లు అనే ఓ కాన్సెప్ట్‌ని తీసుకొచ్చారు పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి సీఎం పవన్‌ కళ్యాణ్‌. 2024 జూన్ నుండి, 8 నెలల వ్యవధిలో 22,500 గోకులం షెడ్లు నిర్మించారు. ఈ షెడ్ల నిర్మాణం ఉపాధి హామీ పథకం – MGNREGS కింద 90% సబ్సిడీతో జరుగుతోంది. ఇది పాడి రైతులకు గణనీయమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తోంది. ఈ సహకారంతో గుంటూరు జిల్లా అనంతవరప్పాడు గ్రామంలో ఈ రైతు గోకులం షెడ్డును ఎంత సౌకర్యవంతంగా నిర్మించుకున్నారో చూడండి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *