PM Kisan yojana: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత విడుదలపై శుభవార్త అందింది. ఇప్పటి వరకూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకున్నా, సాయంత్రంలోగా (జూలై 17) ప్రకటించే అవకాశం ఉన్నది. ఈ మేరకు రేపు (జూలై 18) 20వ విడత రూ.2,000 సొమ్మును ఖాతాల్లో జమ చేయనున్నట్టు దేశవ్యాప్తంగా రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
PM Kisan yojana: బీహార్‌లోని మోతీహారిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ హాజరవనున్నారు. ఆ సభలో పాల్గొన్న అనంతరం కిసాన్ సమ్మాన్ నిధి సొమ్మును ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 19 విడతల్లో రూ.2,000 చొప్పున నగదును రైతుల ఖాతాల్లో జమ చేసింది. 20వ విడతపై ఇంకా ప్రభుత్వం ప్రకటించకపోవడంపై ఉత్కంఠ నెలకొన్నది.

