Anupama Parameswaran: టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన అనుపమ పరమేశ్వరన్ నటించిన ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ సినిమా తాజాగా వివాదంలో చిక్కుకుంది. సురేష్ గోపి కీలక పాత్రలో నటించిన ఈ మళయాళ కోర్ట్‌రూమ్ డ్రామా, తెలుగు, మళయాళ భాషల్లో రిలీజ్ కానుందని కూడా ప్రకటించారు. పోస్టర్లలో తెలుగు రిలీజ్‌ను ప్రమోట్ చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేటర్లలో సినిమా విడుదల కాలేదు. కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రం మళయాళంలోనే స్క్రీనింగ్ జరిగింది. సెన్సార్ బోర్డు అభ్యంతరాలు, టైటిల్‌పై వివాదం కారణంగా ఈ ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తోంది. సినిమా టీమ్ తెలుగు రిలీజ్‌పై తగిన దృష్టి సారించకపోవడం లేదా లాజిస్టికల్ సమస్యలు కారణమా అనే చర్చ జరుగుతోంది. అనుపమ అభిమానులు మాత్రం తెలుగులో సినిమా చూడలేక నిరాశ చెందుతున్నారు.

