Cannabis chocolates:తెలంగాణ రాష్ట్రంలో గంజాయి పలు రూపాల్లో అమ్మకాలు జరుపుతున్నట్టు పోలీసులు విచారణల్లోనే తేటతెల్లమవుతున్నది. ఒకవైపు డ్రగ్స్, మరోవైపు గంజాయి విచ్చలవిడిగా లభ్యమవుతున్నట్టు ఘటనలే చెప్తున్నాయి. హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ హోటల్లో పోలీసులు మాటేసి చాకచక్యంగా గంజాయి అమ్మేవారిని, వాడే వారిని పట్టుకున్న ఘటనను మరువక ముందే వికారాబాద్ జిల్లాలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి.
Cannabis chocolates:వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఈ గంజాయి చాక్లెట్ల అమ్మకాలు కలకలం రేపింది. పీచు మిఠాయి అమ్ముతున్న వ్యక్తి వద్ద ఆ గంజాయి చాక్లెట్లు ఉన్నాయన్న సమాచారంతో స్థానిక పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకున్నారు. ఆ వ్యక్తి ఇక్కడి వ్యక్తి కాదని, ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.
Cannabis chocolates:పీచు మిఠాయి, గంజాయి చాక్లెట్లను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడని పోలీసులు ఆరా తీస్తున్నారు. పక్కా సమాచారంతో ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఇలా గ్రామ గ్రామాన పీచు మిఠాయిలు అమ్ముతూ గంజాయి చాక్లెట్లు కావాలన్న వారికి కూడా వాటిని విక్రయిస్తున్నట్టు అనుమానం వ్యక్తమవుతున్నది. ఒక్కడే వచ్చాడా? లేక ముఠాగా ఏర్పడి ఇలా అమ్మకాలు చేపడుతున్నారా? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.