SRH Bowling Coach

SRH Bowling Coach: సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్‌గా వరుణ్ ఆరోన్‌

SRH Bowling Coach: 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) సీజన్‌లో నిరాశపరిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) 2026 సీజన్ పై ఫోకస్ చేసింది. తాజాగా వరుణ్ ఆరోన్ బౌలింగ్ కోచ్‌గా నియమించింది. ఐపీఎల్ 2026 సీజన్ నుంచి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో జేమ్స్ ఫ్రాంక్లిన్ ఈ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆయన స్థానంలో వరుణ్ ఆరోన్ బాధ్యతలు తీసుకుంటున్నారు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన వరుణ్ ఆరోన్, అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో పలు జట్ల తరపున ఆడిన అనుభవం ఉంది.

ఇది కూడా చదవండి: IND vs ENG: భారత్ ఓటమికి వీరే కారణం!

ఇటీవల ఆయన దేశీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. జార్ఖండ్‌కు చెందిన 35 ఏళ్ల మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ భారతదేశం తరపున 9 టెస్టులు, 9 వన్డేలు ఆడి మొత్తం 29 వికెట్లు పడగొట్టాడు. అతను 150 కి.మీ/గం కంటే ఎక్కువ వేగంతో బౌలింగ్ చేశారు. అతని అంతర్జాతీయ కెరీర్ గాయాల కారణంగా ముగిసింది. ఐపీఎల్‌లో వరుణ్ ఆరోన్ ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ , గుజరాత్ టైటాన్స్ వంటి జట్ల తరపున 52 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు పడగొట్టాడు. జనవరి 2025లో, వరుణ్ ఆరోన్ అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *