Jiiva: తమిళ సినిమా అభిమానులకు మరో క్రేజీ వార్త వచ్చేసింది. స్టార్ హీరో జీవా, బ్లాక్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ బాలసుబ్రమణి మరోసారి చేతులు కలిపారు. జీవా46గా రూపొందుతున్న ఈ చిత్రం కన్నన్ రవి నిర్మాణ సారథ్యంలో భారీ అంచనాలతో తెరకెక్కుతోంది. ఈ రోజు చిత్ర యూనిట్ శుభ ముహూర్తంలో పూజా కార్యక్రమం నిర్వహించింది. బ్లాక్ సినిమాతో జీవా-బాలసుబ్రమణి కాంబో అభిమానులకు అద్భుత అనుభవం అందించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read: Andhra King Taluka: ఆంధ్ర కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పై క్రేజీ న్యూస్!
సినిమా కథ, ఇతర నటీనటుల వివరాలు ఇంకా రివీల్ కానప్పటికీ, బాలసుబ్రమణి గత చిత్రాల తీరును బట్టి ఇది కూడా ఓ ఎమోషనల్ డ్రామా కావచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. త్వరలో ఈ మూవీ నుంచి మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయి.