Saina Nehwal: భారత బ్యాడ్మింటన్ ప్రపంచానికి ఆదివారం రాత్రి పెద్ద షాక్ తగిలింది. స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షాకింగ్ ప్రకటన చేస్తూ, తన భర్త పారుపల్లి కశ్యప్ నుంచి విడిపోయినట్టు వెల్లడించింది. సుమారు 7 సంవత్సరాల పెళ్లి బంధంకు గుడ్ బై చెబుతున్నట్లు ఆమె ప్రకటించింది.
“జీవితం మనల్ని కొన్నిసార్లు వేర్వేరు దిశల్లోకి తీసుకెళుతుంది. ఎంతో ఆలోచించిన తర్వాత, మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం. శాంతి, ఎదుగుదల, స్వస్థత కోసం ఇది మేము తీసుకున్న నిర్ణయం” అని సైనా పేర్కొంది.
పెళ్లి నుంచి ప్రేమలో పయనంతో…
సైనా – కశ్యప్ ప్రేమ కథ హైదరాబాద్‌లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో ప్రారంభమైంది. ఇద్దరూ అక్కడే శిక్షణ తీసుకుంటూ ప్రేమలో పడ్డారు. 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కశ్యప్, సైనాకు వ్యక్తిగత జీవితంలోనే కాదు, ఆమె కెరీర్ చివరి దశలో కోచ్‌గా కూడా మార్గనిర్దేశనం చేశారు.
అందరినీ ఆకట్టుకున్న జంట
సైనా 2012లో లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకంతో చరిత్ర సృష్టించింది. 2015లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకింగ్‌ను అందుకున్న తొలి భారతీయ మహిళా షట్లర్‌గా నిలిచింది. మరోవైపు, కశ్యప్ 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం సాధించాడు. ఇద్దరూ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానాల్లో నిలిచారు.
India’s star shuttlers Saina Nehwal and Parupalli Kashyap announce separation after 7 years of marriage pic.twitter.com/ttZKcfagez
— RCBIANS OFFICIAL (@RcbianOfficial) July 13, 2025
ఇద్దరిలో మారిన దారులు
కొన్ని సంవత్సరాలుగా సైనా గాయాలతో పోరాడుతుండగా, కశ్యప్ ఆటకు గుడ్ బై చెప్పి కోచింగ్ వైపు వెళ్లాడు. సైనాకు ప్రాక్టీస్, వ్యూహాల విషయంలో మద్దతుగా ఉన్నాడు. ఇద్దరి మధ్య ఉన్న బంధం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ప్రస్తుతం పరిస్థితి
సైనా చివరిసారిగా జూన్ 2023లో ప్రొఫెషనల్ టోర్నీలో పాల్గొన్నారు. తాను రిటైర్ అయిందా అనే విషయాన్ని ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కశ్యప్ ఇప్పటివరకు విడాకుల విషయంపై ఎటువంటి స్పందన ఇవ్వలేదు.
భారత బ్యాడ్మింటన్‌కు సైనా ఇచ్చిన ప్రాణం
పదకొండు ఏళ్ల వయసులో ఆటను ప్రారంభించిన సైనా, దేశంలోని బాలికలకు స్పూర్తిగా నిలిచింది. ఆమె ఒలింపిక్ పతకం, నంబర్ 1 ర్యాంకింగ్‌లు యువతకు కొత్త దిశ చూపించాయి. ఇక కశ్యప్ కూడా 2010లో మొదలైన తన ప్రయాణంలో ఎన్నో జయాలను నమోదు చేశాడు.