Selfie Murder Plan

Selfie Murder Plan: సెల్ఫీ దిగుదామని భర్తను నదిలోకి తోసిన భార్య

Selfie Murder Plan:ఇప్పటితరం సంబంధాల్లో నమ్మకం అనేది అంతగా కనిపించకుండాపోతున్నది. భార్యభర్తల బంధం నమ్మకంపైనే నిలబడాలని చెప్పుకుంటున్న సమాజంలో, కొందరు వ్యక్తులు మాత్రం ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. పెళ్లి చేసుకొని రెండు నెలలైనా కాకముందే, భర్తను సెల్ఫీ తీసుకుందామని పిలిచి నదిలో తోసేసింది భార్య  ఇపుడు ఈ ఘటన  సంచలనం రేపుతోంది. కర్ణాటక-తెలంగాణ సరిహద్దులోని కృష్ణా నది వద్ద చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రజలను షాక్‌కు గురిచేసింది. నమ్మకం పేరిట దగ్గరగా ఉంటూ, ద్రోహానికి పాల్పడడం ఇప్పుడు కొత్త సంగతేమీ కాదు గానీ.. ఇంతకూ వెళ్లిపోతుందా అనిపించేలా ఈ ఘటన ఉంది. ఇది కేవలం వ్యక్తిగతంగా ఒకరి జీవితాన్ని కాకుండా, సమాజంలో నమ్మకంపైనే ప్రశ్నలు తీసుకొచ్చే ఘటనగా మారింది. ‘సెల్ఫీ తీసుకుందాం’ అన్న మాట ఒక ప్రాణహాని కుట్రకు అంకురార్పణ అయిందంటే, మనం ఎవరిని నమ్మాలో కూడా సందేహంగా మారిపోయే స్థితి ఏర్పడుతోంది.

ఈ ఘటన రాయచూరు జిల్లా శక్తినగర్ మండలంలోని కడలూరు గ్రామ శివారులో చోటు చేసుకుంది. దేవసూగూరు గ్రామానికి చెందిన తాతప్ప అనే వ్యక్తి తన భార్య సుమంగళతో కలిసి బైక్‌పై ప్రయాణిస్తుండగా, క్రాస్‌లో కృష్ణా నది దగ్గర “సెల్ఫీ తీసుకుందాం” అని భార్య కోరింది.

భర్త తాతప్ప సుమంగళ మాటలు నమ్మి బైక్‌ ఆపి, సెల్ఫీకి సిద్ధమయ్యాడు. అదే సమయంలో సుమంగళ అనూహ్యంగా అతడిని నదిలోకి తోసేసింది. నీటిలో పడ్డ తాతప్ప తాపత్రయంగా ఈదుతూ మధ్యలో ఉన్న రాళ్లపైకి ఎక్కి, కేకలు వేసి సహాయం కోసం పిలిచాడు.

ఇది కూడా చదవండి: Rajya Sabha: రాజ్యసభకు నలుగురు ప్రముఖుల నామినేషన్: రాష్ట్రపతి ఆమోదం!

అంతలోనే బ్రిడ్జిపై వెళ్లుతున్న యువకులు అతన్ని గమనించి వెంటనే తాడు తెచ్చి నీటిలో ఉన్న తాతప్పకి వేసారు. తాడు పట్టుకుని రక్షణ పొందిన తాతప్ప బయటకు వచ్చాడు. ప్రాణాలతో బయటపడ్డ తాతప్ప ఈ సంఘటనపై స్పందిస్తూ, “భార్య ప్రణాళికపూర్వకంగా నన్ను చంపేందుకు ప్రయత్నించింది,” అని ఆరోపించాడు.

మరోవైపు, సుమంగళ మాత్రం “అతను తప్పుదారిలో నదిలోకి జారిపోయాడు” అంటూ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రెండు నెలల క్రితం మాత్రమే ఈ జంటకు వివాహం అయింది. కుటుంబ కలహాలు, అవగాహనల లోపం ఇలా ఏ కారణమయినా, సెల్ఫీ పేరిట భర్త ప్రాణాలు తీయాలి అనుకున్న ఈ ఘటనపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సంఘటనతో ఒక విషయం స్పష్టమవుతుంది — మనుషుల మధ్య నమ్మకానికి బదులుగా ద్రోహం పెరిగిపోతుందన్నది ఆవేదన కలిగించే నిజం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *