Perni Nani: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తూ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత పేర్ని నాని ఫోన్ సంభాషణ ఒకటి తాజాగా లీక్ అయ్యింది. కూటమి నేతలకు, వైసీపీ నేతలకు మధ్య గుడివాడలో జరిగిన వాగ్వాదాన్ని, ఒక బీసీ మహిళపై దాడిగా చిత్రీకరించి రాష్ట్రవ్యాప్తంగా కుల రంగు పులిమి వివాదం సృష్టించేందుకు పేర్ని నాని కుట్ర పన్నినట్లు ఈ సంభాషణ ద్వారా స్పష్టమైంది.
లీక్ అయిన కాల్‌లో, గుడివాడ ఘటనను ఆసరాగా చేసుకుని రాష్ట్రంలో అలజడులు సృష్టించేందుకు పేర్ని నాని చేసిన ప్లాన్ వివరాలు బయటపడ్డాయి. జడ్పీ ఛైర్‌పర్సన్ కారుపై జరిగిన దాడిని, “బీసీ మహిళపై దాడి”గా పేర్కొంటూ, రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులతో కలిసి ఆందోళనలు చేయించాలని ఆయన పిలుపునిచ్చారు. “బీసీ గౌడ మహిళ అని అందరూ బయటకొచ్చి చెప్పాలి” అని కూడా ఆయన సూచించారు.
Also Read: Venkaiah Naidu: కోట శ్రీనివాసరావుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నివాళి..
ఈ కుట్రలో భాగంగా, టీడీపీ అధినేత నారా లోకేష్ ఆదేశాల మేరకు గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే, అతని అనుచరులు ఈ వివాదానికి పాల్పడ్డారని ప్రచారం చేయాలని పేర్ని నాని వ్యూహరచన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా “లోకేష్ డైరెక్షన్‌లో తెలుగుదేశం ఎమ్మెల్యే చేయించారంటూ ఏపీవ్యాప్తంగా ఆందోళన చేయించాలి” అని ఆయన ఫోన్ కాల్‌లో స్పష్టంగా పేర్కొన్నారు.
“లక్ష్యం” (జగన్) చెబితేనే తమ వాళ్ళు జనాల్లోకి బాగా తీసుకెళ్తారని, రాష్ట్రవ్యాప్తంగా కులం పేరుతో గట్టిగా ఆందోళనలు చేస్తే బాగుంటుందని పేర్ని నాని తన సంభాషణలో తెలిపారు. ఈ లీకైన సంభాషణ ద్వారా నారా లోకేష్‌పై బురద చల్లాలనే వైసీపీ పన్నాగం బయటపడటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ ఘటన రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.