Coolie: రజనీకాంత్ మరోసారి తన స్టైల్‌తో అలరించడానికి సిద్ధమయ్యారు. ‘కూలీ’ చిత్రం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. బంగారం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రజనీ శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ‘మోనిక’ సాంగ్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్‌తో సెన్సేషన్ సృష్టించింది. ముఖ్యంగా పూజా హెగ్డే ఎనర్జిటిక్ డ్యాన్స్ స్టెప్పులు యూత్‌ను ఆకర్షిస్తున్నాయి. ఆమె హాట్ డాన్స్ సోషల్ మీడియాని తగలబెట్టేస్తుంది.
ఇక పోతే నాగార్జున, ఉపేంద్ర, శ్రుతి హాసన్ లాంటి స్టార్ కాస్ట్ ఈ చిత్రానికి బలం. సన్ పిక్చర్స్ భారీగా నిర్మిస్తున్న ఈ మూవీ ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీ స్టైల్, లోకేశ్ యాక్షన్ కట్‌లు, అనిరుధ్ బీట్స్‌తో ‘కూలీ’ బ్లాక్‌బస్టర్ హామీ ఇస్తోంది. అభిమానులకు ఈ సినిమా మరో మరపురాని అనుభవం కానుందని టాక్.