Lenin: అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని తన కొత్త చిత్రం ‘లెనిన్’తో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ‘ఏజెంట్’ తర్వాత గ్యాప్ తీసుకుని, ఈ సినిమాతో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందిస్తున్న ఈ రాయలసీమ నేపథ్య చిత్రం హింసాత్మక ప్రేమకథగా రూపొందుతోంది. మొదట హీరోయిన్గా శ్రీలీల ఎంపికైనా, షెడ్యూల్ సమస్యలతో ఆమె తప్పుకున్నట్లు సమాచారం.
Also Read: Pawan Kalyan OG Movie: షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’.. అనుకున్న టైం కే థియేటర్ లోకి సినిమా
ఆమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే ఈ నెల 16 నుంచి షూటింగ్లో జాయిన్ కానున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్‌తో ‘లెనిన్’ భారీ అంచనాలు రేపుతోంది. ఈ సినిమా అఖిల్‌కి సాలిడ్ హిట్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

