Arunachalam Giri Pradakshina:అరుణాచలం తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణకు పవిత్రకార్యంగా భావించి లక్షలాది మంది తెలుగు ప్రజలు నిత్యం వెళ్తుంటారు. అలాంటి భక్తులకు సరైన రక్షణ చర్యలు లేవన్న డొల్లతనం తాజాగా బయటపడింది. పవిత్ర స్నానమాచరించి గిరి ప్రదక్షిణకు బయలుదేరి ఓ తెలుగు భక్తుడిని అక్కడి తమిళులు ఇద్దరు దారుణంగా హత్య చేశారు. భక్తులకు సరైన రక్షణ లేదనడానికి ఈ దారుణ ఘటనే నిదర్శనంగా నిలిచింది.
Arunachalam Giri Pradakshina:తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా సౌందరాపురానికి చెందిన విద్యాసాగర్ (32) అరుణాచలం వెళ్లారు. అక్కడ గురువారం (జూలై10) రాత్రి నిద్ర చేశారు. శుక్రవారం (జూలై 11) వేకువజామున పుణ్యస్నానమాచరించి తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణకు బయలుదేరారు. ఇదే సమయంలో భక్తులను దోచుకునేందుకు కాపుకాసిన ఇద్దరు తమిళనాడుకు చెందిన దుండగులు ఎదురుగా వచ్చి విద్యాసగర్‌ను దారుణంగా కొట్టారు.
Arunachalam Giri Pradakshina:విద్యాసాగర్ వద్ద ఉన్న రూ.500ను గుంజుకొని, గొంతు కోసి ఆ ఇద్దరు తమిళ వ్యక్తులు పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆ భక్తుడిని తోటి భక్తులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతిచెందారు. భక్తులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. విద్యాసాగర్‌ను హత్య చేసినట్టుగా భావిస్తున్న గుగనేవ్వరన్ (22), తమిళరసన్ (25)లను పోలీసులు అరెస్టు చేశారు. పుణ్యానికి పోతే పాపం అడ్డొచ్చిందన్నట్టుగా ఏకంగా ప్రాణమే పోయింది.
Arunachalam Giri Pradakshina:ఇదిలా ఉండగా, అరుణాచలం గిరి ప్రదక్షిణలో తెలుగు భక్తులపై అక్కడి తమిళులు వివక్ష చూపుతున్నారని పలువురు భక్తులు ఆరోపిస్తున్నారు. ఇటీవల తెలుగు భక్తులు లక్షల సంఖ్యలో వెళ్తుండటం గమనార్హం. ఈ దశలో అక్కడ భక్తులకు సరైన రక్షణ చర్యలు కల్పించాలని భక్తులు కోరుతున్నారు. వివక్ష, తమిళుల నుంచి దారుణాలు ఇలాగే కొనసాగితే భక్తుల సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నారు.

