Air India Plane Crash

Air India Plane Crash: విచారణకు పూర్తిగా సహకరిస్తాం.. AAIB రిపోర్ట్​పై బోయింగ్​, ఎయిర్​ఇండియా

Air India Plane Crash: జూన్ 12న గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఎయిర్ ఇండియా ఎయిర్‌ బస్-171 విమానం టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 270 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఒకరే ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల్లో ప్రయాణికులతో పాటు విమాన సిబ్బంది కూడా ఉన్నారు. దురదృష్టవశాత్తూ, విమానం ఓ మెడికల్ కాలేజ్ హాస్టల్‌పై పడటంతో అక్కడ ఉన్న కొంతమంది విద్యార్థులు కూడా మృతి చెందారు.

ఈ ఘటనపై ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) 15 పేజీల ప్రాథమిక నివేదికను విడుదల చేసింది. విమానం టేకాఫ్ అయిన వెంటనే ఇంధన నియంత్రణ (ఫ్యూయల్ కంట్రోల్) స్విచ్‌లు పని చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అందులో పేర్కొన్నారు.

బోయింగ్ స్పందన:

బోయింగ్ సంస్థ దీనిపై వెంటనే స్పందించింది. వీరి ప్రకటనలో,

“ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలు, స్నేహితులు బాధను మేం గుండె నిండా అనుభవిస్తున్నాం. విమాన ప్రమాద దర్యాప్తుకు మేము పూర్తి సహకారం అందిస్తాము. అంతర్జాతీయ పౌర విమానయాన నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని సమాచారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.” అని తెలిపింది.

బోయింగ్ సీఈఓ కెల్లీ ఓర్ట్‌బర్గ్ కూడా మరో ప్రకటన చేశారు.

“బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. ఈ విషయంలో ఎయిర్ ఇండియా ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖర్‌తో మాట్లాడాను. మా బృందం దర్యాప్తుకు పూర్తి సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంది.” అన్నారు.

ఎయిర్ ఇండియా స్పందన:

AAIB నివేదిక వెలువడిన వెంటనే ఎయిర్ ఇండియా కూడా స్పందించింది.
వారు చెప్పినది:

“15 పేజీల నివేదికను అందుకున్నాము. విమాన ప్రమాద దర్యాప్తులో AAIBతో పాటు ఇతర అధికారులతో పూర్తిగా కలిసి పనిచేస్తాం. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాము.”
అని ప్రకటించింది.

ఇది కూడా చదవండి:

Transportation: ఫోర్త్ సిటీ నుండి అమరావతికి కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే

Leopards in Balapur: హైదరాబాద్‌ శివారులో చిరుతల కలకలం.. ఒంటరిగా బయట తిరగొద్దని అధికారుల ప్రకటన

AP Liquor Scam Case: కర్మ చేయడం నీ హక్కు.. ఫలితాలపై నీకు హక్కు లేదు.. నేడు మరోసారి సిట్‌ విచారణకు సాయిరెడ్డి..

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Noida: దారుణం.. పెళ్లి చేసుకుంటా అంటూ నమ్మించి.. ఆరు నెలలుగా అత్యాచారం..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *